ప్రహరీ గోడకు మూడు గేట్లు ఉండవచ్చా?

ఇంటికి బాహ్యంగా ఒక దిక్కులో మాత్రమే మూడు ద్వారాలు ఉండకూడదని వాస్తుశాస్త్రంలో చెప్పారు కానీ... ఒక ద్వారం ఎదురుగా మూడు, ఐదు, ఏడు ఉండవచ్చు. ఎలాంటి దోషమూలేదు. ప్రహరీకి గేట్లు పెట్టేప్పుడు ....

Updated : 14 Nov 2022 14:29 IST

ప్రహరీ గోడకు మూడు గేట్లు ఉండవచ్చా?

మా ఇంటికి సింహద్వారం ఎదురుగా వరుసగా ఐదు ద్వారాలు ఉన్నాయి. ప్రహరీ గోడకు మూడు గేట్లు ఉన్నాయి. ఇలా ఉంటే దోషమా?

- గీత, హైదరాబాద్‌

ఇంటికి బాహ్యంగా ఒక దిక్కులో మాత్రమే మూడు ద్వారాలు ఉండకూడదని వాస్తుశాస్త్రంలో చెప్పారు కానీ... ఒక ద్వారం ఎదురుగా మూడు, ఐదు, ఏడు ఉండవచ్చు. ఎలాంటి దోషమూలేదు. ప్రహరీకి గేట్లు పెట్టేప్పుడు ఏ దిక్కుకైనా సరే ఒకటి లేదా రెండు మాత్రమే ఉండాలి. మూడోది రాకూడదు. ఒకవేళ రెండు దిక్కులకు రోడ్లు ఉన్నట్లయితే ఒక దిక్కున రెండు, మరో దిక్కున ఒకటి ఉన్నా ఎలాంటి దోషమూ లేదు. రెండు దిక్కులను కలిపి మనం చూడాల్సిన అవసరం లేదు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని