నేటి నుంచి రియల్టర్ల జాతీయ సదస్సు

రియల్టర్ల అతిపెద్ద జాతీయ సదస్సు నేటి నుంచి రెండు రోజులపాటు(శని, ఆదివారాలు) మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో జరగనుంది. హైదరాబాద్‌ రియల్టర్ల అసోసియేషన్‌(హెచ్‌ఆర్‌ఏ) 11వ నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ రియల్టర్స్‌(ఎన్‌ఏఆర్‌)

Updated : 24 Aug 2019 02:01 IST

ఈనాడు, హైదరాబాద్‌

రియల్టర్ల అతిపెద్ద జాతీయ సదస్సు నేటి నుంచి రెండు రోజులపాటు(శని, ఆదివారాలు) మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో జరగనుంది. హైదరాబాద్‌ రియల్టర్ల అసోసియేషన్‌(హెచ్‌ఆర్‌ఏ) 11వ నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ రియల్టర్స్‌(ఎన్‌ఏఆర్‌) ఇండియా ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. మార్కెట్‌ను మలుపు తిప్పే అంశాలు ప్రధాన అజెండాగా సదస్సు సాగనుంది. ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌ ఇండియా డైరెక్టర్‌ మహ్మద్‌ అసీఫ్‌ ఇక్బాల్‌ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. క్రెడాయ్‌ అధ్యక్షుడు సతీష్‌ మగర్‌, ఎన్‌ఏఆర్‌ ఇండియా ఛైర్మన్‌ రవివర్మ, అధ్యక్షుడు ఇర్షాద్‌ అహ్మద్‌ పాల్గొంటున్నారు. గుర్తింపు కలిగిన రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లే రియల్టర్లు. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, 38 నగరాల్లో వీరు 30వేల మంది వరకు ఉన్నారు. ప్రస్తుతం జరిగే జాతీయ సదస్సులో స్థిరాస్తి రంగానికి సంబంధించి పలు అంశాలు చర్చకు వస్తాయి. ఈ రంగంలో ఇటీవల పలు మార్పులు వస్తున్నాయి. అవన్నీ భవిష్యత్తులో మార్కెట్‌ దిశను మార్చనున్నాయి. కోవర్కింగ్‌ స్పేస్‌- అవకాశాల గురించీ ప్రస్తావన ఉంటుంది. ఔత్సాహికవేత్తగా ఎదగడంపై నాస్కామ్‌ ఛైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి తొలిరోజు ప్రసంగిస్తారు. ఎక్కువ శాతం రియల్టర్ల నైపుణ్యాభివృద్ధికి దోహదపడే అంశాలపై సమాంతంగా నిపుణుల ప్రసంగాలు ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని