ఐటీ చట్టంలో మార్పులు అవసరం: స్థిరాస్తి సంఘాలు

రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన అధికారిక కనీస రేటు (సర్కిల్‌ రేట్‌) కంటే తక్కువ ధరకు ఇళ్లు, ఫ్లాట్లు విక్రయించలేమని.. అందుకు

Updated : 06 Jun 2020 09:04 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన అధికారిక కనీస రేటు (సర్కిల్‌ రేట్‌) కంటే తక్కువ ధరకు ఇళ్లు, ఫ్లాట్లు విక్రయించలేమని.. అందుకు ఆదాయ పన్ను చట్టం అనుమతి ఇవ్వదని స్థిరాస్తి సంఘాలు అంటున్నాయి. నిర్మాణం పూర్తయిన ఇళ్లు, ఫ్లాట్లను వాస్తవ ధరలకు విక్రయించుకుంటే, వడ్డీభారం తగ్గుతుందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌ బిల్డర్లను కోరిన నేపథ్యంలో సంఘాలు పై విధంగా స్పందించాయి. ప్రస్తుత సర్కిల్‌ విలువ కంటే 10 శాతం లేదా అంతకంటే తక్కువకు లావాదేవీ/డీల్‌ విలువ జరిగితే గృహ కొనుగోలుదారులు లేదా డెవలపర్లపై అదనపు పన్ను భారం పడుతుందని స్థిరాస్థి సంఘాలైన క్రెడాయ్‌, నారెడ్కోలు పేర్కొన్నాయి. ఒక వాణిజ్య ఆస్తి లేదా ప్లాట్‌, లేదా అపార్ట్‌మెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించే కనీస విలువను సర్కిల్‌ రేటు అంటారు. అయితే ఈ సర్కిల్‌ రేటు కంటే తక్కువకు విక్రయించాలంటే ఆదాయ పన్ను చట్టంలో మార్పులు చేయాలని సంఘాలు కోరుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు