సరఫరా తక్కువ

అందుబాటు ధరల్లో ఇళ్లకు డిమాండ్‌ ఉన్నా.. సరఫరా మాత్రం చాలా తక్కువగా ఉంది. గత నెలలో అనరాక్‌ సంస్థ విడుదల చేసిన మూడో త్రైమాసికం  నివేదికతో ఇది మరోసారి

Updated : 11 Dec 2021 06:25 IST

ఈనాడు, హైదరాబాద్‌ : అందుబాటు ధరల్లో ఇళ్లకు డిమాండ్‌ ఉన్నా.. సరఫరా మాత్రం చాలా తక్కువగా ఉంది. గత నెలలో అనరాక్‌ సంస్థ విడుదల చేసిన మూడో త్రైమాసికం నివేదికతో ఇది మరోసారి నిరూపితమైంది. రూ.40 లక్షల లోపు సరఫరా కేవలం 11 శాతమే ఉంది. రూ.80 లక్షల వరకు అయితే గరిష్ఠంగా 42 శాతం వరకు ఉంది. ఈ విభాగంలో ఎక్కువగా కొత్త ప్రాజెక్టులు మొదలయ్యాయి. రూ.80 లక్షల నుంచి కోటిన్నర మధ్య కూడా సరఫరా ఎక్కువే ఉంది. అది 36 శాతం వరకు ఉంది.

ధరల పెరుగుదల చూస్తే..

* నగరంలో చదరపు అడుగు సగటు ధరలను పరిశీలిస్తే ఏటేటా పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది.

* 2015 మూడో త్రైమాసికంలో చ.అ. సగటు ధర రూ.3800 ఉండగా, 2016 నాటికి రూ.4వేలకు చేరింది. ఆ తర్వాత మూడేళ్ల పాటూ ధరలు స్థిరంగా ఉన్నాయి. స్వల్ప పెరుగుదల మాత్రమే కనిపించింది.

* కొవిడ్‌ ముందు వరకు రూ.4100 ఉన్న ధర ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి రూ.4320కి చేరింది. రూ.4500 చేరేందుకు ఎంతో సమయం పట్టదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు ఈ ధరను దాటేశాయని చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని