స్థలాలు ఎక్కడ కొంటున్నారంటే..?

భవిష్యత్తులో ఇల్లు కట్టుకునేందుకు.. పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం సామాన్య, మధ్య తరగతివాసులు స్థలాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇతర అన్ని మదుపు సాధనాలతో పోలిస్తే

Updated : 04 Jun 2022 04:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: భవిష్యత్తులో ఇల్లు కట్టుకునేందుకు.. పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం సామాన్య, మధ్య తరగతివాసులు స్థలాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇతర అన్ని మదుపు సాధనాలతో పోలిస్తే రియల్‌ ఎస్టేట్‌లోనే ఎక్కువ రాబడి వస్తుండటం.. స్వల్పకాలంలో భూముల ధరలు పెరుగుతుండటంతో స్థిరాస్తి మార్కెట్‌ ఎక్కువగా ఆకర్షిస్తోంది. దీంతో చేతిలో ఉన్న కొంత పొదుపు సొమ్ముకు అదనంగా అప్పుచేసి.. రుణం తీసుకుని మరి కొనుగోలు చేస్తున్నారు. ఎక్కడ కొంటున్నారంటే...

* ప్రభుత్వం ప్రకటించే కొత్త ప్రాజెక్టులు వచ్చే ప్రాంతాలపై నజర్‌ పెడుతున్నారు. ఆయా ప్రాజెక్ట్‌ చుట్టుపక్కల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీర్ఘకాలానికి కొనుగోలు చేస్తున్నారు.
* మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నచోట నిర్మాణ రంగం వృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువ కావడంలో అలాంటి చోట పెట్టుబడి పెడుతున్నారు. స్థిర నివాసం ఏర్పర్చుకుంటున్నారు.

* గత రెండు మూడు దశాబ్దాల్లో నిర్మాణం రంగం పశ్చిమ హైదరాబాద్‌ వైపు బాగా పెరిగింది. ఇప్పటికే ఎక్కువ మంది అటువైపే కొనుగోలు చేస్తున్నారు.  
* పని ప్రదేశానికి సమీపంలోనే ఉండేందుకు హైదరాబాదీలు ఇష్టపడుతున్నారు. చుట్టుపక్కల ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉన్న చోట ఇళ్ల నిర్మాణం త్వరగా వస్తుందని అలాంటి చోట కొంటున్నారు.

* కొత్తగా అభివృద్ధి చేసిన నివాసాల నడుమ ఉన్న స్థలాలకు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. ఖాళీ స్థలాల లభ్యత తగ్గే కొద్దీ ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది. సొంతింటి కోసం ఇక్కడ కొంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని