రెండేళ్ల వరకు స్థిర వడ్డీ

‘‘తమ ప్రాజెక్ట్‌లో ఇళ్లు కొనేవారికి రెండేళ్ల పాటు 6.75 శాతం స్థిర గృహ రుణ వడ్డీరేటు’’.. ముంబయిలో ఒక స్థిరాస్తి సంస్థ కొనుగోలుదారులకు కల్పిస్తున్న భరోసా ఇది. ఇటీవల ఆర్‌బీఐ రెపో రేటు రెండుసార్లు పెంచడంతో గృహరుణ వడ్డీరేట్లు పెరిగాయి. రుణం తీసుకుని ఇళ్లు కొనుగోలు చేయాలని చూస్తున్న

Published : 09 Jul 2022 03:47 IST

కొనుగోలుదారులకు స్థిరాస్తి సంస్థల ఆఫర్లు
ఈనాడు, హైదరాబాద్‌

‘‘తమ ప్రాజెక్ట్‌లో ఇళ్లు కొనేవారికి రెండేళ్ల పాటు 6.75 శాతం స్థిర గృహ రుణ వడ్డీరేటు’’.. ముంబయిలో ఒక స్థిరాస్తి సంస్థ కొనుగోలుదారులకు కల్పిస్తున్న భరోసా ఇది. ఇటీవల ఆర్‌బీఐ రెపో రేటు రెండుసార్లు పెంచడంతో గృహరుణ వడ్డీరేట్లు పెరిగాయి. రుణం తీసుకుని ఇళ్లు కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఈ పరిణామం ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో కొనుగోలుదారులు ఇళ్లు కొనాలా? వద్దా? అనే ఆలోచనలో పడ్డారు. ఇప్పటి వరకు పెరిగిన రేట్లతో ప్రభావం పెద్దగా లేదని.. మున్ముందు ఇంకా పెరిగితే మాత్రం ఇళ్ల విక్రయాలపై ఆ ప్రభావం ఉంటుందని బిల్డర్లు అంటున్నారు. వాస్తవంగా చూస్తే వడ్డీరేట్లు పెరిగితే కాలపరిమితి పెరుగుతుంది తప్ప ఈఎంఐలో మార్పులేమీ వెంటనే ఉండవు. కానీ వడ్డీరేట్ల పెంపు అనేది మార్కెట్‌ సెంటిమెంట్‌కు కారణమవుతుంది. ఇది చాలా బలంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి వడ్డీరేట్ల పెరుగుదల కారణంగా కొనుగోలుదారులు వెనకడుగు వేయకుండా నిర్మాణదారులు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. మున్ముందు హైదరాబాద్‌లోనూ రాయితీలు ప్రకటించే అవకాశం ఉంది.
*  మే, జూన్‌ నెలల్లో 90 బేసిక్‌ పాయింట్ల వరకు వడ్డీరేట్లు పెరిగాయి. ఈఎంఐ భారం 6.97 శాతం పెరిగింది. ఫలితంగా ఇళ్లు కొనుగోలు స్థోమత 2 శాతం తగ్గిందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా అధ్యయనంలో పేర్కొంది.


కొనుగోలు స్థోమతపై ప్రభావమిలా.. (శాతాల్లో)
పెరుగుదల ఈఎంఐ స్థోమత పెంపు తగ్గుదల
0.5 3.84 1.11
1.0 7.76 2.23
1.5 11.73 3.38


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని