వెంచర్లలో ప్రవాసుల భాగస్వామ్యం

స్థిరంగా సాగిపోతున్న హైదరాబాద్‌ రియల్‌ వ్యాపారంలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు అవుతున్నారు. నిన్న మొన్నటి వరకూ అపార్టుమెంట్లలో ఫ్లాట్‌లు, ఇళ్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో నివాసాలు కొంటూవస్తున్న ఎన్‌ఆర్‌ఐలు ఇప్పుడు ఏకంగా ఆ ప్రాజెక్టుల్లోనే పెట్టుబడులు పెడుతున్నారు.

Published : 12 Nov 2022 01:00 IST

ఈనాడు, హైదరాబాద్‌

స్థిరంగా సాగిపోతున్న హైదరాబాద్‌ రియల్‌ వ్యాపారంలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు అవుతున్నారు. నిన్న మొన్నటి వరకూ అపార్టుమెంట్లలో ఫ్లాట్‌లు, ఇళ్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో నివాసాలు కొంటూవస్తున్న ఎన్‌ఆర్‌ఐలు ఇప్పుడు ఏకంగా ఆ ప్రాజెక్టుల్లోనే పెట్టుబడులు పెడుతున్నారు. ఇందుకోసం స్థిరమైన రియల్‌ వ్యాపారాలు సాగుతున్న పట్టణాలపై దృష్టి పెడుతున్నారు. దీనికి చిరునామాగా నిలిచిన హైదరాబాద్‌లో ఇటీవల ఎన్‌ఆర్‌ఐల ‘రియల్‌’ భాగస్వామ్యం ఎక్కువైనట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. స్థిరాస్తి వ్యాపారం ఎక్కడ ఒడిదొడుకులకు గురైనా.. రాష్ట్ర రాజధానితో పాటు పరిసర ప్రాంతాలకు ఢోకా లేకపోవడంతో స్వరాష్ట్రానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలే కాకుండా పొరుగు రాష్ట్రానికి చెందిన వారు సైతం ఇక్కడ చేపడుతున్న భారీ రియల్‌ ప్రాజెక్టుల్లో భాగస్వాములు అవుతున్నారు.

ఇళ్ల పైనా కూడా..

77 శాతం మంది పెద్ద ఇళ్లు కావాలని కోరుకుంటుంటే.. 55 శాతం మంది 3 బెడ్‌రూమ్‌ల ఇళ్లు, 23 శాతం మంది 4 బెడ్‌రూమ్‌ల ఇళ్లు, 22 శాతం మంది రెండు పడక గదుల ఇళ్లను ఎంపిక చేసుకుంటున్నట్టు తెలిసింది. కొవిడ్‌కు ముందు పరిస్థితితో పోల్చితే.. 2 బీహెచ్‌కేలను ఎంచుకున్న సంఖ్య తగ్గింది. రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల విలువ చేసే ఇళ్లను గతేడాది కొంటే.. ఈ ఏడాది ఇది రూ.2.5 కోట్ల వరకూ చేరిందని పలువురు అంటున్నారు. కొవిడ్‌ ముందు ఎన్‌ఆర్‌ఐల పెట్టుబడులు 55 శాతం ఉంటే.. ప్రస్తుతం 71 శాతానికి చేరినట్లు సీఐఐ-ఆన్‌రాక్‌ అధ్యయనం వెల్లడించింది. ఇవన్నీ ఒకెత్తయితే ఇప్పుడు నగర శివార్లలో ఏకంగా రియల్‌ వెంచర్లలో భాగస్వాములు అవుతున్నారు. ఇక్కడ భూమి కొనడం నుంచే వారి పెట్టుబడులు మొదలవుతున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని