రెరాకు ఫిర్యాదులు

ఇల్లు కట్టే సమయంలో పడే ఇక్కట్లు, ఇబ్బందులను తలచుకుని.. చాలామంది కట్టిన ఇల్లు కొనడం మేలనే నిర్ణయానికి వస్తుంటారు.

Updated : 10 Dec 2022 06:21 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇల్లు కట్టే సమయంలో పడే ఇక్కట్లు, ఇబ్బందులను తలచుకుని.. చాలామంది కట్టిన ఇల్లు కొనడం మేలనే నిర్ణయానికి వస్తుంటారు. ఉద్యోగం, వృత్తిపరంగా తీరిక లేక వాటివైపు మొగ్గుచూపుతుంటారు. వ్యాపార ధోరణితో సాగే స్థిరాస్తి విపణిలో ఇల్లు కొంటే నాణ్యత లోపాలు, అవకతవకలు కొనుగోలుదారులను వేధిస్తున్నాయి. వీటిని నియంత్రించి కొనుగోలుదారులకు బాసటగా నిల్చేందుకు కేంద్రం స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి చట్టం(రెరా) తీసుకురాగా.. తెలంగాణలో 2017 ఆగస్టు 4 నుంచి అమల్లోకి వచ్చింది. రెరా అథారిటీ ఏర్పాటు పూర్తి స్థాయిలో లేకపోవడంతో  ఫిర్యాదులకు న్యాయం జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రీలాంచ్‌లపై రెరాకు ఫిర్యాదులు వస్తున్నాయి.

* స్థిరాస్తి కొనుగోళ్లు ఎక్కువగా మధ్యవర్తుల ద్వారానే జరుగుతుంటాయి. మధ్యవర్తినీ రెరా చట్టం పరిధిలోకి తీసుకొచ్చి వారికి చట్టబద్ధంగా గుర్తింపునకు నమోదు ప్రక్రియను రూపొందించింది. మధ్యవర్తి చేసే సేవా లోపాలకు నిర్మాణదారుడితో సహా బాధ్యునిగా నిబంధనలో పేర్కొన్నారు. వీరిపైన ఫిర్యాదులు చేయొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని