కొనే ముందే అప్రమత్తంగా..

స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు అనుమతులన్నీ ఉండి.. నిబంధనల మేరకు ఉన్నవాటినే ఎంపిక చేసుకుంటే ఆస్తులకు రక్షణతోపాటు ప్రశాంతంగా ఉండొచ్చు.

Updated : 17 Dec 2022 04:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు అనుమతులన్నీ ఉండి.. నిబంధనల మేరకు ఉన్నవాటినే ఎంపిక చేసుకుంటే ఆస్తులకు రక్షణతోపాటు ప్రశాంతంగా ఉండొచ్చు. ఇటీవల మార్కెట్లో ఆకర్షణీయ పెట్టుబడి మార్గాలు ఊరిస్తున్నాయి. వీటిలో పెట్టుబడులు పెట్టే ముందే ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేఅవుట్‌కు అనుమతి.. నిబంధనలు పాటించారా.. బిల్డర్లు, డెవలపర్ల గత చరిత్ర తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం మేలు. ప్రాజెక్ట్‌లు చెప్పిన సమయానికి పూర్తిచేసిన చరిత్ర ఉందా.. అని కూడా తెలుసుకోవాలి.

స్థలాల విషయంలో..

శివార్లన్నీ హెచ్‌ఎండీఏ పరిధిలోకి వస్తాయి. ఏ లేఅవుట్‌ అయినా హెచ్‌ఎండీఏ, రెరా అనుమతి ఉంటేనే సక్రమం. అనుమతిచ్చిన వెంచర్లలో మొత్తం ప్లాట్లలో 15 శాతం మార్ట్‌గేజ్‌ చేస్తారు. వీటిని కొనకూడదు. ప్లాన్‌లో ఈ ప్లాట్లపై ఎర్ర మార్కుంటుంది. అంటే ఇంకా మార్ట్‌గేజ్‌లో ఉన్నట్లు. నిబంధనల మేరకు ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే వీటిని విడుదల చేసినప్పుడు కొనవచ్చు.

ఇళ్లు.. ఫ్లాట్లు..

నివాస ధ్రువపత్రం వచ్చాకనే ఫ్లాట్లు కొనాలి. మొదటి, రెండు అంతస్తుల్లోని ఫ్లాట్లు జీహెచ్‌ఎంసీ మార్ట్‌గేజ్‌లో ఉంటాయి. బిల్డింగ్‌ అనుమతి ప్లాన్‌లో ఈ వివరాలుంటాయి. నిబంధనలన్ని పాటించి నిర్మాణం చేపడితే వీటిని విడుదల చేస్తారు. అప్పుడే కొనాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని