గతేడాది ఎక్కడెక్కడ తీసుకున్నారంటే..

అపార్ట్‌మెంట్లు, విల్లాలు, స్థలాలు, భూముల కొనుగోళ్లతో 2022లో స్థిరాస్తి మార్కెట్‌ సాఫీగా దూసుకెళ్లింది. 2021తో పోల్చితే 2022లో కొన్ని జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌(డీఆర్‌వో) కార్యాలయాల పరిధిలో డాక్యుమెంట్లు తగ్గినా మొత్తంగా సిటీలోని నాలుగు డీఆర్‌వోల పరిధిలో లావాదేవీలు పెరిగాయి. 

Updated : 07 Jan 2023 03:33 IST

ఈనాడు - హైదరాబాద్‌

అపార్ట్‌మెంట్లు, విల్లాలు, స్థలాలు, భూముల కొనుగోళ్లతో 2022లో స్థిరాస్తి మార్కెట్‌ సాఫీగా దూసుకెళ్లింది. 2021తో పోల్చితే 2022లో కొన్ని జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌(డీఆర్‌వో) కార్యాలయాల పరిధిలో డాక్యుమెంట్లు తగ్గినా మొత్తంగా సిటీలోని నాలుగు డీఆర్‌వోల పరిధిలో లావాదేవీలు పెరిగాయి.  శివార్లే సరిహద్దుగా రియల్‌ వ్యాపారం సాగింది. రంగారెడ్డి పరిధిలో గ్రేటర్‌లో అత్యధిక లావాదేవీలు ఇక్కడే జరిగాయి. మేడ్చల్‌ పరిధిలో దాదాపుగా కిందటి ఏడాది మాదిరే లావాదేవీలు జరిగాయి. హైదరాబాద్‌తో పోల్చితే.. హైదరాబాద్‌ సౌత్‌ పరిధిలో ఎక్కువ స్థిరాస్తి వ్యాపారం సాగింది. రంగారెడ్డి పరిధిలో శేరిలింగంపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కంటే.. మహేశ్వరం ప్రాంతంలో ఎక్కువ రిజిస్ట్రేషన్లు అయ్యాయి. తర్వాత రాజేంద్రనగర్‌, శంషాబాద్‌, చేవెళ్లలో ఎక్కువ మొత్తంలో రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఆదాయంలో మెరుగు

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయ లక్ష్యాలను అధిగమించడంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్‌లో స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం వందల కోట్లలో ఉంటే.. రంగారెడ్డి జిల్లాలో వేల కోట్లలో ఉంది. అదే మార్గంలో మేడ్చెల్‌ కూడా  ఉంది.. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల సంఖ్యలో పెద్ద తేడా లేకపోయినా.. 2022 ఆరంభంలో స్థిరాస్తుల విలువలు పెరగడంతో ఆదాయం రెట్టింపు అయినట్టయ్యింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని