టీఎస్‌బీపాస్‌తో వేగం పెరిగింది

రాష్ట్ర ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన టీఎస్‌బీపాస్‌ విధానం ద్వారా నిర్మాణ అనుమతుల జారీలో వేగం పెరిగిందని జీహెచ్‌ఎంసీ తెలిపింది.

Published : 08 Apr 2023 00:02 IST

వృద్ధి చెందుతున్న ఆకాశహర్మ్యాల సంస్కృతి
ఈనాడు, హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన టీఎస్‌బీపాస్‌ విధానం ద్వారా నిర్మాణ అనుమతుల జారీలో వేగం పెరిగిందని జీహెచ్‌ఎంసీ తెలిపింది. భారీ ప్రాజక్టులకు సైతం నిబంధనల మేరకు ఉన్న వాటికి చకచకా అనుమతులు ఇస్తున్నట్లు తెలిపింది. 75గజాల వరకు ఇన్‌స్టంట్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా, 75-600 చ.గ విస్తీర్ణం లోపు భూమిలో కట్టే నిర్మాణాలకు సత్వర అనుమతి(ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌) ద్వారా, అంతకు మించిన విస్తీర్ణంలో చేపట్టే భవనాలకు ఏక గవాక్ష విధానం(సింగిల్‌ విండో) ద్వారా అనుమతులు వేగంగా అందుతున్నాయని తెలిపింది.

గ్రేటర్‌లో గృహ నిర్మాణంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 13,522 నిర్మాణాలకు బిల్డర్లు అనుమతి పొందారు. అంతక్రితం ఏడాది 2021-22లో 17,334 అనుమతులు జారీ అయ్యాయి. మూడు వేలకు పైగా అనుమతులు తగ్గాయి. అయితే అంతక్రితం కొవిడ్‌తో వాయిదా పడిన అనుమతులన్నీ 2021-22 ఆర్థిక సంవత్సరంతో తీసుకోవడంతో బేస్‌ ఎఫెక్ట్‌తో ఆ ఏడాది అనుమతులు పెరిగాయని నిర్మాణదారులు విశ్లేషించారు.

ఎత్తైన భవనాలు సైతం..

ఆకాశహర్మ్యాలు ఏటా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 40 అంతస్తులకన్నా ఎత్తైన ప్రాజెక్టులు నాలుగు ఆమోదం పొందాయి. వాటిలో ఒకటి 50 అంతస్తుల ప్రాజెక్టు. దాని ఎత్తు 165 మీటర్లు. పది నుంచి 40 అంతస్తుల ఎత్తైన ప్రాజెక్టులు 53 ఆమోదం పొందాయి. అందులో వాణిజ్య కేటగిరీకి చెందిన ప్రాజెక్టులు ఏడు ఉన్నాయి. గతంతో పోలిస్తే ఆకాశహర్మ్యాల ప్రాజెక్టులు పెరిగాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు