క్రెడాయ్‌ జాతీయ కార్యదర్శిగా గుమ్మి రాంరెడ్డి

రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్ల అత్యున్నత సంస్థ క్రెడాయ్‌కి 2023-25 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

Published : 15 Apr 2023 00:38 IST

ఈనాడు, హైదరాబాద్‌ : రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్ల అత్యున్నత సంస్థ క్రెడాయ్‌కి 2023-25 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షుడిగా బొమన్‌ ఇరానీ ఎన్నికయ్యారు. ఛైర్మన్‌గా మనోజ్‌ గౌర్‌, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌గా శేఖర్‌ పటేల్‌ వ్యవహరించనున్నారు. జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు మరోసారి ప్రాతినిధ్యం దక్కింది. క్రెడాయ్‌ నేషనల్‌ కార్యదర్శిగా ఆర్క్‌ గ్రూప్‌ సీఎండీ గుమ్మి రాంరెడ్డి ఎన్నికయ్యారు.ప్రస్తుతం ఈయన జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అంతకుముందు క్రెడాయ్‌ తెలంగాణ అధ్యక్షుడు, ఛైర్మన్‌గా సేవలందించారు. శనివారం ముంబయిలో జరిగే కార్యక్రమంలో కొత్త కార్యవర్గం బాధ్యతలు చేపట్టనుంది. క్రెడాయ్‌కి దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల ఛాప్టర్లు ఉన్నాయి. 230 నగరాల్లో సిటీ ఛాప్టర్లు ఉన్నాయి.13,300 మంది బిల్డర్లు సభ్యులుగా ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని