అమలు విధానం బాగుంది

తెలంగాణలో నిర్మాణ అనుమతుల జారీని సులభతరం చేసిన టీఎస్‌బీపాస్‌ చట్టం సహా దాని అమలు తీరును ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర పురపాలకశాఖ, టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల బృందం ప్రశంసించింది.

Published : 27 May 2023 01:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో నిర్మాణ అనుమతుల జారీని సులభతరం చేసిన టీఎస్‌బీపాస్‌ చట్టం సహా దాని అమలు తీరును ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర పురపాలకశాఖ, టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల బృందం ప్రశంసించింది. నిర్మాణ అనుమతుల విధానాన్ని పరిశీలించేందుకు మూడ్రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన బృందం శుక్రవారం జీహెచ్‌ఎంసీని సందర్శించింది. ఈ సందర్భంగా నగర ముఖ్య ప్రణాళికాధికారి(సీపీపీ) దేవేందర్‌రెడ్డి వారికి టీఎస్‌బీపాస్‌ అమలు తీరును సమగ్రంగా వివరించారు. నగరంలో టీఎస్‌బీపాస్‌ ద్వారా జారీ అయిన అనుమతులు, గడువులోపు దరఖాస్తుల ఆమోదం లేదా తిరస్కరణకు గురవుతుండటం, నివాసయోగ్యపత్రాల జారీ, దరఖాస్తులను తొక్కిపెట్టే అధికారులపై నిఘా, ఇతరత్రా అంశాలపైనా అవగాహన కల్పించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని