గ్లోబల్ కేంద్రాలతో డిమాండ్
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుతో కార్యాలయాల లీజింగ్‌లో ఊపు వచ్చింది.
ఈనాడు, హైదరాబాద్
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుతో కార్యాలయాల లీజింగ్‌లో ఊపు వచ్చింది. 2023-25 నాటికి 60 నుంచి 62 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో జీసీసీలు దేశంలోని ఆరు అగ్రశ్రేణి నగరాల్లో ఏర్పాటు కాబోతున్నాయి.
దేశంలో ప్రస్తుతం 1580 జీసీసీలు ఉండగా... 2025 నాటికి 1900కు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఈ కేంద్రాలు ఎక్కువ విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తుండటంతో కార్యాలయాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇక్కడ తక్కువ అద్దెలు, మానవ వనరుల లభ్యత, కంపెనీ అనుకూల పరిస్థితులు ఉండటంతో ఏర్పాటుకు మరిన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయి. ప్రస్తుత లీజింగ్‌లో జీసీసీ వాటానే 35 నుంచి 40 శాతం వరకు ఉంటోంది.
పోటీ నేపథ్యంలో
- గ్లోబల్ కేపబులిటీ కేంద్రాల ఏర్పాటుకు దిల్లీ, బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్ నగరాలు పోటీపడుతున్నాయి. జనవరి-జూన్ వరకు పరిశీలిస్తే వీటివాటా 38 శాతంగా ఉంది.
- బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలే మొత్తం లీజింగ్‌లో 77 శాతం వాటా కలిగి ఉన్నాయి.
- బెంగళూరులో కార్యాలయాల లీజింగ్ 13 మిలియన్ చ.అ. జరిగితే ఇందులో ఈ ఏడాది తొలి అర్ధభాగంలో జీసీసీ వాటా 44 శాతం కావడం విశేషం.
- హైదరాబాద్‌లో 6 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో లీజింగ్ లావాదేవీలు జరిగితే జీసీసీ వాటా 20 శాతంగా ఉంది.
- చెన్నై 4 మిలియన్ చదరపు అడుగుల్లో 13 శాతం జీసీసీ వాటా కలిగి ఉంది. పుణెలో 3 మిలియన్ చ.అ.ల్లో 10 శాతం వాటా జీసీసీదే.
- ఐటీ, జీవశాస్త్రాలు, ఆటోమొబైల్, ఏవియేషన్ రంగాల్లో జీసీసీలు ఏర్పాటువుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Arshdeep Singh: ‘చివరి ఓవర్లో సూర్య భాయ్ ఒకే మాట చెప్పాడు’.. అర్ష్‌దీప్ వెల్లడి
-
Stock Market: రంకేసిన బుల్.. మదుపర్లకు లాభాల పంట
-
prabhakar Rao: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఓఎస్డీ ప్రభాకర్‌రావు రాజీనామా
-
Kishan Reddy: నిరాశను దరి చేరనీయం.. మా లక్ష్యం కోసం పనిచేస్తాం: కిషన్‌రెడ్డి
-
Mizoram: మూడున్నర దశాబ్దాల తర్వాత కొత్త ముఖం.. ఐపీఎస్ నుంచి సీఎం వరకు ‘లాల్దుహోమా’..!
-
Rinku Singh: రింకూ ఆ పాత్రకు సరిపోతాడా!