ఆనంద ఆవాసాలు
ఈనాడు, హైదరాబాద్
పదవీ విరమణ తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకోవడం సహజం. కానీ ఉరుకులు పరుగుల జీవితంలో ఎక్కువ మంది పెద్దవారు ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నారు. కాలక్షేపానికి కబుర్లు చెప్పుకుందామంటే మనుషులు కరవవుతున్నారు. ఆరోగ్యం గురించి పట్టించుకునే వారే ఉండటం లేదని వాపోతున్నారు. విశ్రాంత జీవితంలో ఎక్కువ మంది పెద్దవారిని బాధిస్తున్న విషయాలివి. రిటైర్మెంట్ హోమ్స్‌లో పెద్దలకు ఎలాంటి లోటు లేకుండా ఉత్సాహంగా జీవించేలా సకల సౌకర్యాలు ఉంటాయని నిర్మాణదారులు అంటున్నారు. నగర శివార్లలో పెద్దల కోసం ప్రత్యేకంగా కొన్ని స్థిరాస్తి సంస్థలు ఈ తరహా ఇళ్లు నిర్మిస్తున్నాయి. ఆదరణ బాగుండటంతో మరిన్ని సంస్థలు వీటిని చేపట్టబోతున్నాయి.
నిర్మాణ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలు వస్తుంటాయి. ఆధునిక జీవనశైలిలో కొనుగోలుదారుల అవసరాలను గుర్తించి ఆ మేరకు గృహ నిర్మాణంలో మార్పులు, చేర్పులు, సౌకర్యాలు, హంగులతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. సమాజంలో క్రమంగా పెద్దల జనాభా పెరుగుతూ వస్తోంది. వీరి ఆలోచనలు, అవసరాలు అన్నీ భిన్నం. వీరిని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్నవే రిటైర్మెంట్ హోమ్స్. పదవీ విరమణ చేసిన వారు మాత్రమే ఉండాలని కాదు.. పెద్దవారు ఎవరైనా ఇక్కడ ఇళ్లు కొనుగోలు చేసి సౌకర్యంగా ఉండొచ్చు. అందరితో కలిసి జీవించవచ్చు. మలి జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. స్నేహ పూరిత వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు.
పూర్తి భద్రత..
రిటైర్మెంట్ హోమ్స్ అంటే వృద్ధాశ్రమాలు అనుకునేరు.. ఇక్కడ అన్ని వయసుల వారు హాయిగా జీవించవచ్చు. ముఖ్యంగా పెద్దవారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ సౌకర్యాలు ఉంటాయి. సహజంగానే పెద్ద వయసు వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఒకరికొకరు తమ భావాలను పంచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒంటరితనం అనే ప్రశ్నే ఉండదు. ఎవరింట్లో వారు ఉంటూనే వారి అభిరుచులను కొనసాగిస్తూనే... అందరూ కలిసి సంతోషంగా గడపవచ్చు. వీటిలో పూర్తి భద్రత ఉంటుంది. ప్రతి ఇంటికి ప్రత్యేక అలారం ఉంటుంది. మీట నొక్కితే చాలు సిబ్బంది నిమిషాల్లో గుమ్మం వద్ద ఉంటారు.
కామన్ కిచెన్‌తో..
ఓపిక ఉంటే ఇంట్లోనే వండుకోవచ్చు. లేకపోతే కామన్ కిచెన్‌లో భోజనం చేయవచ్చు. ఇలాంటి సదుపాయాలు ఉండటం వల్ల కూడా ఎక్కువ మంది రిటైర్మెంట్ హోమ్స్‌ను ఇష్టపడుతున్నారు. పెద్దవారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే వంటకాలు సిద్ధం చేస్తారు. డైనింగ్ హాల్ వరకు రాలేకపోతే ఇంటికే పంపిస్తారు. ఆ ఏర్పాట్లు వీటిలో ఉన్నాయి.
నిర్మాణ దశ నుంచే..
పెద్దల ఇళ్ల నిర్మాణంలో డిజైనింగ్ దశ నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విల్లాలైతే మెట్లు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. బహుళ అంతస్తుల నివాసాల్లో అయితే ప్రవేశ మార్గాల్లో ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. స్నానాల గదుల్లో పట్టుకునేందుకు వీలుగా హ్యాండ్బార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంట్లో గదుల్లో, స్నానాల గదుల్లో ఇంటర్‌కామ్ సదుపాయం తప్పనిసరి. హఠాత్తుగా ఎక్కడైనా పడిపోతే ఒక బటన్ నొక్కితే సిబ్బందికి సమాచారం చేరేలా ఏర్పాట్లు వీటిలో ఉన్నాయి. జారి పడకుండా ఉండేలా ఫ్లోరింగ్, నడవలేనివారి కోసం చక్రాల కుర్చీ వంటి సదుపాయాలు ఉంటున్నాయి. కొంపల్లి, మేడ్చల్ వైపు ఎక్కువగా ఈ తరహా గృహ నిర్మాణాలు అందుబాటులో ఉన్నాయి. ప్రాంతీయ వలయ రహదారి వెంట కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు మరికొన్ని సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి.
పిలవగానే వైద్యుడు వచ్చేలా..
జీవన ప్రమాణాలు పెరగడంతో జీవించే కాలం పెరిగింది. అదే సమయంలో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఏ సమయంలో ఏ సమస్య వస్తుందో తెలియదు. రిటైర్మెంట్ హోమ్స్‌లోనే ప్రత్యేకంగా క్లినిక్ ఉంటుంది. పిలవగానే వైద్యుడు వస్తారు. క్రమం తప్పకుండా రక్తపోటు, మధుమేహం పరీక్షలు చేయించుకుంటూ... వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో దగ్గరలోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌లు సైతం సిద్ధంగా ఉంటాయి.
అందర్నీ దృష్టిలో పెట్టుకుని..
పెద్దల కోసం నిర్మిస్తున్న బహుళ అంతస్తుల నివాసాల్లో అన్నివర్గాలను దృష్టిలో పెట్టుకుని ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. స్టూడియో అపార్ట్మెంట్ మొదలు ఒకటి, రెండు, మూడు, నాలుగు పడకల గదుల వరకు అందుబాటులో ఉంటున్నాయి. 400 చదరపు అడుగుల నుంచి రెండువేల చ.అ. విస్తీర్ణం ఉంటుంది. అవసరం, ఆర్థిక స్థోమతను బట్టి తగిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. ఒక్కరే ఉంటున్నట్లయితే స్టూడియో, ఒక పడక గది ఫ్లాట్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఫ్లాట్లే కాదు కొత్తగా పలు ప్రాజెక్టులు వీరిని దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత ఇళ్లు, విల్లాలు నిర్మిస్తున్నాయి. మరికొన్ని ప్రణాళిక దశలో ఉన్నాయి.
స్మార్ట్‌గా నివసించేలా..
రిటైర్మెంట్ హోమ్స్ హైదరాబాద్‌తో పాటూ దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లో నిర్మిస్తున్నారు. ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించే దిశగా స్థిరాస్తి సంస్థలు ఆలోచనలు చేస్తున్నాయి. మెట్రో నగరాల్లో అయితే స్మార్ట్ ఫీచర్లను జోడిస్తున్నాయి. దిల్లీలోని ఒక సంస్థ ఇంట్లోని గృహోపకరణాలను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ఆధారంగా పనిచేసేలా డిజైన్ చేసింది. హైదరాబాద్‌లోనూ పలు సంస్థలు స్మార్ట్ హోమ్స్ నిర్మిస్తున్నాయి. పెద్దల ఇళ్లకు ఈ పోకడ విస్తరించాల్సి ఉంది.
పెద్దవాళ్లు ఒకసారి కుర్చీలో కూర్చున్నాక, మంచంపై పడుకున్నాక పదేపదే లేవడానికి అందరికీ శరీరం సహకరించదు. ఇలాంటి వారికి స్మార్ట్, ఇంటిలిజెంట్ రిటైర్మెంట్ హోమ్స్ చాలా సౌకర్యంగా ఉంటాయి.
* ఇంట్లోని లైట్లు, ఏసీ, గీజర్, టీవీ, ఫ్యాన్లు కృత్రిమ మేథతో పనిచేసేలా చేస్తారు. అలెక్సాకు కమాండ్స్ ఇవ్వడం ద్వారా ఆన్, ఆఫ్ అవుతాయి.
* సమయానికి మందులు వేసుకునేలా అలెక్సా పెద్దవాళ్లకు గుర్తు చేస్తుంది.
* కమ్యూనిటీలోని ఇతరులతో మాట్లాడేందుకు ఫోన్ లైన్ కలుపుతుంది. ఇలాంటి చాలా ఫీచర్లు జోడిస్తున్నారు.
* గృహోపకరణాలు మొబైల్ నుంచి కూడా పనిచేసేలా చేస్తున్నారు.
* పెద్దల భద్రత, రక్షణ విషయంలో రాజీ పడకుండా స్మార్ట్ హోమ్స్‌ను డిజైన్ చేస్తున్నారు.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
MK Stalin: ఎవరైనా అలా చేస్తే నేనే డిక్టేటర్‌గా మారతా.. చర్యలు తీసుకుంటా : సీఎం స్టాలిన్
-
Politics News
Devendra Fadnavis: అవును.. మాది ‘ఈడీ’ ప్రభుత్వమే..!
-
Sports News
IND vs ENG: నాలుగో రోజు తొలి సెషన్ పూర్తి.. టీమ్ఇండియా ఆధిక్యం 361
-
Movies News
Bimbisara: చరిత్రలోకి తీసుకెళ్లేలా ‘బింబిసార’ ట్రైలర్.. కల్యాణ్‌రామ్ రాజసం చూశారా!
-
Politics News
Telangana News: కాంగ్రెస్ గూటికి తెరాస మేయర్.. రాహుల్ సమక్షంలో చేరిక
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- బిగించారు..ముగిస్తారా..?
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!