ఎఫ్‌ఎస్‌ఐ ఆంక్షలు విధించాలి

టీడీఆర్‌కు డిమాండ్‌ ఉండాలంటే నగరంలో ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌(ఎఫ్‌ఎస్‌ఐ) పరిమితులు విధించాలని నరెడ్కో వెస్ట్‌జోన్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ జీహెచ్‌ఎంసీకి సూచించింది.. టీడీఆర్‌కు డిమాండ్‌ పెంచేందుకు బిల్డర్ల సంఘాలతో ఇటీవల

Updated : 07 May 2022 05:46 IST

18 అంతస్తులు దాటితే టీడీఆర్‌ తీసుకునేలా..  
జీహెచ్‌ఎంసీకి సూచించిన నరెడ్కో వెస్ట్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: టీడీఆర్‌కు డిమాండ్‌  ఉండాలంటే నగరంలో ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌(ఎఫ్‌ఎస్‌ఐ) పరిమితులు విధించాలని నరెడ్కో వెస్ట్‌జోన్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ జీహెచ్‌ఎంసీకి సూచించింది.. టీడీఆర్‌కు డిమాండ్‌ పెంచేందుకు బిల్డర్ల సంఘాలతో ఇటీవల జీహెచ్‌ఎంసీ అధికారులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చేసిన సూచనలపై నరెడ్కో వెస్ట్‌జోన్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ప్రేం కుమార్‌ ‘ఈనాడు’తో మాట్లాడుతూ...
* ఎకరా విస్తీర్ణంలో 1.75 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోపే నిర్మాణాలకు అనుమతించాలని.. అది కూడా 18 అంతస్తులు మించరాదని కోరింది. ఆ తర్వాత అదనపు అంతస్తులకు టీడీఆర్‌ ఇవ్వాలని సూచించింది. ఫలితంగా టీడీఆర్‌లకు డిమాండ్‌ ఉంటుందని తెలిపింది. ఎఫ్‌ఎస్‌ఐ ఆంక్షలు విధించాలని సూచించింది.
* ఐదు అంతస్తుల అపార్ట్‌మెంట్ల భవన నిర్మాణాలే సిటీలో అధికం. అదనపు అంతస్తులు వేసేందుకు టీడీఆర్‌ తీసుకునేందుకు అగ్నిమాపక నిబంధనలు, ఎన్వోసీ అవసరం పడుతోంది. హైరైజ్‌ సెట్‌బ్యాక్‌ వదలాల్సి వస్తోంది. దీంతో ఎవరూ ముందుకు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు సడలించి 21 మీటర్ల ఎత్తు వరకు టీడీఆర్‌కు అనుమతి ఇవ్వాలి. గతంలో నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ ప్రకారం 15 మీటర్ల ఎత్తు ఆంక్షలు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 18 మీటర్ల వరకు మినహాయింపు ఉండేలా సవరణలు చేసింది. ఇప్పుడు అలాగే చేయాలి.
* టీడీఆర్‌కు డిమాండే కాదు సెల్లార్‌ సమస్య ఇబ్బందులు తొలుగుతాయి. 30 అడుగుల రహదారిలో సెల్లార్‌కు అనుమతి లేదు. కాబట్టి ఇలాంటి చోట రెండు సెల్లార్లు లేకుండా రెండు స్టిల్ట్‌లకు అవకాశం ఉంటుంది.
* ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ వచ్చిన ఆరునెలల తర్వాతే ఆస్తి పన్ను విధించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని