పాత ఇంటికి కొత్త లిఫ్ట్‌ ఎలా?

కొత్తగా కట్టే ఇళ్లలో లిఫ్ట్‌ బిగించుకోవడం చాలా సులువు. మరి ఇదివరకు ఎప్పుడో కట్టిన ఇళ్లలో లిఫ్ట్‌ కోసం ప్రత్యేకంగా స్థలం వదిలి ఉంటే తప్ప కొత్తవాటి ఏర్పాటు సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ బయటి నుంచి ఏర్పాటు చేసుకున్నా.. అనుమతించిన దానికంటే ఎత్తు పెరగడం..

Published : 25 Jun 2022 02:33 IST

ఈనాడు, హైదరాబాద్‌ : కొత్తగా కట్టే ఇళ్లలో లిఫ్ట్‌ బిగించుకోవడం చాలా సులువు. మరి ఇదివరకు ఎప్పుడో కట్టిన ఇళ్లలో లిఫ్ట్‌ కోసం ప్రత్యేకంగా స్థలం వదిలి ఉంటే తప్ప కొత్తవాటి ఏర్పాటు సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ బయటి నుంచి ఏర్పాటు చేసుకున్నా.. అనుమతించిన దానికంటే ఎత్తు పెరగడం.. నిబంధనల అతిక్రమణ వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలు లేకుండా కొత్త ఎలివేటర్లు వచ్చాయి.

* మారుతున్న అవసరాలను తీర్చే క్రమంలో సంప్రదాయ ట్రాక్షన్‌ ఎలివేటర్లకు కాలం చెల్లింది. ఇప్పుడు మిషన్‌ రూంలెస్‌(ఎంఆర్‌ఎల్‌) లిఫ్ట్‌లు వచ్చాయి. అల్యూమినియం, పాలీకార్బొనేట్‌తో తయారు చేసిన వాక్యుమ్‌ ఎలివేటర్లు, హైడ్రాలిక్‌ లిఫ్ట్‌లు వినియోగంలోకి వచ్చాయి. పాత ఇళ్లకు హైడ్రాలిక్‌ లిఫ్ట్‌లు అనుకూలం.

*వ్యక్తిగత ఇళ్లు, విల్లాలకు తగ్గట్టుగా పలు సంస్థలు హైడ్రాలిక్‌ లిఫ్ట్‌లను అందిస్తున్నాయి. సులువుగా బిగించుకునే వీలుండటం వీటిలో ప్రత్యేకత అంటున్నారు తయారీదారులు.

 *ఒకవేళ గుంత తీయాల్సి వస్తే 200 ఎంఎం లోతు తీస్తే చాలు. పైన హెడ్‌రూమ్‌ వెడల్పు 2500 ఎంఎం ఉంటే చాలు. ఆటోమేటిక్‌, సెమీ ఆటోమేటిక్‌లో లభిస్తున్నాయి.

* నగరంలోని చాలా ఇళ్లలో, గృహ సముదాయాల్లో ఉమ్మడి అవసరాలకు సౌరశక్తిని వినియోగిస్తున్నారు. విద్యుత్తు బిల్లులను తగ్గించుకునేందుకు ‘సోలార్‌ రూఫ్‌టాప్‌’ను వినియోగిస్తున్నారు. సౌరశక్తి బ్యాటరీలతో ఈ లిఫ్ట్‌లు పనిచేయగలుగుతున్నాయి. కాబట్టి కరెంట్‌ పోతే ఎలా అనే ఆందోళన అక్కర్లేదు. జనరేటర్‌ లేకపోయినా సోలార్‌ రూఫ్‌టాప్‌ ఉంటే చాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని