ఇల్లు కొనగలిగే స్థోమత 2 శాతం తగ్గింది

గృహరుణ వడ్డీరేట్ల పెంపుదలతో ఇల్లు కొనుగోలు చేసే స్థోమత తగ్గిందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా వెల్లడించింది. ఆర్‌బీఐ 90 బీపీఎస్‌ రేటు పెంపుదలతో గృహ కొనుగోలు స్థోమతను సగటున 2 శాతం తగ్గించిందని శుక్రవారం విడుదల చేసిన 2022 ప్రథమార్థ అఫర్డబిలిటీ ఇండెక్స్‌లో సూచించింది.

Published : 02 Jul 2022 03:38 IST

ముంబయి తర్వాత ఖరీదైన మార్కెట్‌గా హైదరాబాద్‌

ఈనాడు, హైదరాబాద్‌: గృహరుణ వడ్డీరేట్ల పెంపుదలతో ఇల్లు కొనుగోలు చేసే స్థోమత తగ్గిందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా వెల్లడించింది. ఆర్‌బీఐ 90 బీపీఎస్‌ రేటు పెంపుదలతో గృహ కొనుగోలు స్థోమతను సగటున 2 శాతం తగ్గించిందని శుక్రవారం విడుదల చేసిన 2022 ప్రథమార్థ అఫర్డబిలిటీ ఇండెక్స్‌లో సూచించింది. దేశంలోనే ముంబయి తర్వాత అత్యంత ఖరీదైన గృహ మార్కెట్‌గా హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉందని వెల్లడించింది.

* దేశంలోని ఎనిమిది అగ్ర శ్రేణి నగరాల్లో ఈఎంఐ, ఆదాయ నిష్పత్తిని విశ్లేషించగా.. 22 శాతంతో అహ్మదాబాద్‌ అత్యంత సరసమైన గృహ మార్కెట్‌గా నిలవగా.. 26 శాతంతో పుణె, చెన్నై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

* కోల్‌కతా 27 శాతం, బెంగళూరు 28, దిల్లీ రాజధాని ప్రాంతం 30 శాతంగా అఫర్డబిలిటీ ఇండెక్స్‌ చూపిస్తుండగా.. హైదరాబాద్‌ 31 శాతం, ముంబయి 56 శాతంతో కొనగలిగే స్థోమత తక్కువ ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని