చెక్కు చెదరదు.. తుప్పు పట్టదు
గృహ నిర్మాణంలో క్రమంగా స్టీల్ తలుపుల వైపు మొగ్గు
కలప తరహాలో ఆకట్టుకునే డిజైన్లలో లభ్యం
ఈనాడు, హైదరాబాద్
గృహ వినియోగంలో ఇప్పుడిప్పుడే వాడకం మొదలైనా.. పరిశ్రమలు, విద్యాసంస్థలు, కన్వెన్షన్ హాల్స్, థియేటర్లు, మాల్స్‌లో స్టీల్ తలుపుల వినియోగం చాలాకాలంగా ఉంది. తొలుత ఫార్మా పరిశ్రమల్లో క్లీన్‌రూం కోసం వినియోగించే వారు. మంటలను తట్టుకునే తలుపులు తప్పనిసరిగా ఉండాలనే అగ్నిమాపక శాఖ నిబంధనలతో మాల్స్‌లోనూ వాడకం పెరిగింది. ఆసుపత్రుల్లోనూ రేడియేషన్ ప్రభావం తగ్గించేందుకు లెడ్ షీట్ కల్గిన తలుపుల వినియోగం అనివార్యం కావడం.. స్టీల్ వాటిల్లోనే ఇది సాధ్యమవడంతో అక్కడా ఉపయోగిస్తున్నారు. ఇటీవల వాణిజ్య భవనాల్లో, పాఠశాలల్లో విరివిగా వాడుతున్నారు.
చెక్క మాదిరి... ఇళ్లకు వచ్చేసరికి స్టీల్ తలుపులు అనగానే మొదట్లో విముఖత ఉండేది. ఇంట్లో ఉక్కు వాడొద్దు అనే అభిప్రాయంతో ఉండేవారు. కలప లభ్యత తగ్గిపోవడం, ఆ తలుపులు ఖరీదుగా మారడం, అన్నింటికీ మించి కలప మాదిరి డిజైన్లు.. స్టీల్‌లోనూ లభిస్తుండటంతో క్రమంగా ఆసక్తి చూపుతున్నారు. గాల్వనైజ్ స్టీల్‌తో వీటిని తయారు చేస్తున్నారు. రెండు షీట్‌ల మధ్య హనికోంబ్‌ను వాడతారు. అవసరాన్ని బట్టి రాక్‌వూల్‌నీ వినియోగిస్తారు. తలుపులు తయారయ్యాక కలప మాదిరి కావాల్సిన డిజైన్ వచ్చేలా ఎంబోజ్ చేస్తారు. పీవీసీ ఫ్లష్ తలుపుల మాదిరి, కలపతో చెక్కిన వాటి మాదిరిగా డిజైన్ చేయించుకోవచ్చు.
ఇవీ ప్రయోజనాలు..
* కలపతో పోలిస్తే చెదలు పట్టే సమస్య ఉండదు. దీర్ఘకాలం మన్నుతుంది.
* యూపీవీసీ కిటికీలకు రంగులు వేయలేం. ఇందులో ఐదారేళ్లకు ఒకసారి నచ్చిన రంగులను వేసుకోవచ్చు.
* స్టీలు తలుపులు, కిటికీల్లో కలప రంగుతో పాటుగా కావాల్సిన ఇతర రంగులను ఎంచుకునే వీలుంటుంది.
* బయటి శబ్దాలు గదిలోకి రాకుండా, గదిలోని శబ్దాలు బయటకు వినపడకుండా నివారిస్తుంది.
* రాఘవ్ ఇల్లు కొని నాలుగేళ్లు అవుతోంది. స్నానాల గదిలోని తలుపులు నీళ్లు పడి పాడైపోయాయి. కలపతో చేసిన మరో తలుపు బిగించినా ఇదే పరిస్థితి. నీటిని తట్టుకునే పీవీసీ ఫ్లష్ తలుపులు వచ్చినా మన్నిక తక్కువే. కొద్దిరోజులు కాగానే ఆకారం మారిపోయి వికారంగా కన్పిస్తున్నాయి. ఈ అనుభవాలతో తాజాగా మార్కెట్లోకి వస్తున్న స్టీల్ డోర్ బిగించుకున్నాడు. తుప్పు పట్టదు కనీసం పాతికేళ్లు మన్నికగా ఉంటుందనే ధీమాతో ఉన్నాడు.
అవగాహన పెరిగింది.. కలప కిటికీల స్థానాన్ని యూపీవీసీ విండోస్ భర్తీ చేస్తున్నాయి. ఇటీవల నిర్మించే బహుళ అంతస్తుల భవనాలు మొదలు వ్యక్తిగత ఇళ్ల వరకు వీటిపైనే ఆధారపడుతున్నారు. మరి తలుపుల మాటేమిటి? ఇప్పటికే కలప, పీవీసీ ఫ్లష్ డోర్లను వాడుతున్నారు. ప్రస్తుతం వీటి స్థానంలో క్రమంగా స్టీల్ డోర్స్ వస్తున్నాయి. చైనా నుంచి పెద్దఎత్తున దిగుమతి కావడం, టాటా వంటి సంస్థలు ప్రత్యేకంగా స్టీల్ తలుపుల మార్కెట్లోకి ప్రవేశించడంతో నిర్మాణదారుల్లో వీటిపై అవగాహన పెరిగిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇళ్లలో ప్రధాన ద్వారం మొదలు, వంటగది, పడకగది, స్నానాల గదుల వరకు స్టీల్ డోర్స్ వినియోగం క్రమంగా పెరుగుతోంది.
అన్నిచోట్లా వినియోగం...
* స్టీల్ తలుపులు ఫ్రేమ్‌తో సహా లభిస్తాయి.
* ఇల్లు, కార్యాలయం, ప్రధాన ద్వారం, వంటగది, స్నానాలగది.. ఇలా ప్రతిచోట బిగించుకోవచ్చు. ప్రధాన ద్వారమైతే గ్రిల్ మెష్‌తో తయారు చేయించుకోవచ్చు.
* ఆసుపత్రుల్లో తలుపులంటే మదర్ అండ్ సన్ డిజైన్‌ను ఎంచుకోవచ్చు. కిటికీల్లో షట్టర్ గ్రిల్ బిగించుకోవచ్చు.
* ఇటీవల గోడలు తగ్గించి వెలుతురు ఎక్కువగా ఉండేలా గాజు ఫ్రేములు అమర్చుకుంటున్నారు. స్లైడ్ డోర్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. ఇవీ దృఢంగా ఉండేందుకు స్టీల్ వైపు చూస్తున్నారు.
చెబితే తప్ప తెలియదు..
కలప స్థానంలో ప్రత్యామ్నాయంగా మెటల్ డోర్స్ అంటున్న కాలంలో.. 2006లో మా కంపెనీని ప్రారంభించాం. అప్పట్లో ప్రభుత్వం ఇంటి అవసరాల కోసం చెట్లను కొట్టడం ఆపి, పర్యావరణాన్ని కాపాడుకునేలా మరింత పచ్చదనం పెంచడంపై దృష్టిపెట్టింది. కానీ మన దగ్గర అప్పటికీ వీటిపై అంత సుముఖత లేదు. పశ్చిమ దేశాలు ఎప్పటి నుంచో వినియోగిస్తున్నాయి. ఇక్కడ ఇన్ని సంవత్సరాల తర్వాత వాణిజ్యపరంగా వీటి వాడకం బాగా పెరిగింది. ఫార్మా, పరిశ్రమలు, పాఠశాలల్లో ఉపయోగిస్తున్నారు. తాజాగా ఇళ్లలోనూ వాడకం మొదలైంది. స్టీల్ తలుపులు అని చెబితే తప్ప గుర్తించని విధంగా ఉంటాయి. రెండు స్టీల్ షీట్లు తీసుకుని తుప్పు పట్టకుండా దానిపై జింక్ కోటింగ్ ఇచ్చి రెండింటి మధ్య కాగితంతో తయారీ చేసిన హనికొంబ్ పెట్టి ఒక బోర్డు మాదిరి తయారు చేస్తాం. ఇదివరకు ఈ కాగితాన్ని నెదర్లాండ్ నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం. ఇప్పుడు భారత్‌లోనే దొరుకుతుంది. వీటి సహాయంతో తలుపులు ఫ్యాక్టరీలో అత్యంత కచ్చితమైన కొలతలు ఉండేలా లేజర్ కట్టింగ్‌తో తయారవుతాయి. కలపతో చేసిన వాటితో పోలిస్తే తక్కువ సమయంలోనే బిగించుకోవచ్చు. తద్వారా నిర్మాణ సమయం ఆదా అవుతుంది. అపార్ట్‌మెంట్లలో మూడునెలలు పట్టే ఈ పని స్టీల్ తలుపులతో వారం పదిరోజుల్లో ముగుస్తుంది. టేకుతో పోలిస్తే 60 శాతం తక్కువ, పీవీసీ ఫ్లష్ వాటితో పోలిస్తే 20 శాతం అధిక ధర ఉంటుంది.
- మహ్మద్ రఫీ, ఎండీ, యాక్సెస్ టఫ్ డోర్స్
Advertisement
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Hyderabad: ఆ ట్వీట్‌తో దిల్లీ నుంచి హైదరాబాద్‌కు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
-
World News
Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
-
India News
Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
-
Sports News
T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
-
Viral-videos News
Viral Video: రోడ్డుపై నీటి గుంత.. అందులోనే స్నానం చేస్తూ వ్యక్తి నిరసన!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
- Gali Janardhana Reddy: ‘గాలి’ అడిగితే కాదంటామా!
- Arthroscopy: మీ మోకీలుకు నొప్పి ఎక్కువగా ఉందా..? ఏం చేయాలో తెలుసా..!
- Viral Video: రోడ్డుపై నీటి గుంత.. అందులోనే స్నానం చేస్తూ వ్యక్తి నిరసన!