ఎల్లెడలా.. నిర్మాణాల విస్తరణ

రాజ ప్రాసాదాలు నగరంలో నిర్మాణరంగానికి దర్పాన్ని తెచ్చాయి. చౌమొహల్లా, ఫలక్‌నుమా ప్యాలెస్‌లు ఇలా దేనికదే ప్రత్యేక నిర్మాణ శైలితో హైదరాబాద్‌ కీర్తిని చాటగా.. తర్వాత నగరం మూసీని దాటి నలుదిశలా అభివృద్ధి చెందింది. జంట నగరాలకు

Updated : 13 Aug 2022 05:59 IST

ఈనాడు, హైదరాబాద్‌

రాజ ప్రాసాదాలు నగరంలో నిర్మాణరంగానికి దర్పాన్ని తెచ్చాయి. చౌమొహల్లా, ఫలక్‌నుమా ప్యాలెస్‌లు ఇలా దేనికదే ప్రత్యేక నిర్మాణ శైలితో హైదరాబాద్‌ కీర్తిని చాటగా.. తర్వాత నగరం మూసీని దాటి నలుదిశలా అభివృద్ధి చెందింది. జంట నగరాలకు సైబరాబాద్‌ తోడైంది. ఐటీ కారిడార్‌ను సందర్శిస్తే.. మనం అమెరికాలో ఉన్నామా అనే భావన కలుగుతుంది. గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వైపు వెళ్తే.. ఐటీ సామ్రాజ్యం మన సొంతంలా అభివృద్ధి చెందింది. 

ఒకప్పుడు దూరం అనుకున్నవే..

1980లలో అమీర్‌పేట్‌తో నగరం అయిపోయింది. 1986 నాటికి కూకట్‌పల్లి చాలా దూరమనిపించేది. ఇప్పుడు పటాన్‌చెరు సైతం చేరువైపోయింది. ఈ మధ్యలో వేల కాలనీలు..లక్షల ఇళ్లు వచ్చేశాయి. ఒకప్పటి రింగురోడ్డులే ఇన్నర్‌ రింగురోడ్డులుగా మారిపోయాయి. ఇప్పుడు ఓఆర్‌ఆర్‌ కూడా దశాబ్దం తర్వాత మరో ఇన్నర్‌ రింగురోడ్డుగా మారిపోతుంది. త్వరలో వచ్చే రీజనల్‌ రింగురోడ్డు వరకూ నగరం విస్తరించి దేశంలోనే అతి విశాలమైన విశ్వనగరంగా మారుతుందని అంచనా. 

వెళ్తున్నకొద్దీ  దగ్గరవుతోంది

హైదరాబాద్‌ నగర అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేవు. మూడు దశాబ్దాల క్రితం కొత్తగా ఇల్లు తీసుకుంటే.. నాంపల్లి రైల్వే స్టేషన్, అసెంబ్లీ, సచివాలయానికి ఎంత దూరం అని చూసేవారు. ఏ వస్తువు కొనాలన్నా అబిడ్స్‌ వచ్చేవారు. తర్వాత అమీర్‌పేట, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, ఈసీఐఎల్‌ క్రాస్‌రోడ్సు, ఐటీ కారిడార్‌ ఇలా వ్యాపార చిరునామాలు మారిపోతున్నాయి. హైటెక్‌సిటీ హద్దుగా ఇంటి స్థలం చూడడం..కొనడం అలవాటైంది. తర్వాత ఇప్పుడు ఓఆర్‌ఆర్‌ హద్దుగా ఎన్ని కిలోమీటర్లు అని అంచనా వేసి స్థిరాస్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పుడు అది కూడా దాటిపోయి ఆర్‌ఆర్‌ఆర్‌ హద్దుగా రియల్‌ వ్యాపారం జరుగుతోంది.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని