Updated : 24 Sep 2022 03:38 IST

టీవీ గోడకుంటేనే సౌకర్యం

ఈనాడు, హైదరాబాద్‌: అపార్టుమెంటులో ఫ్లాట్‌ అయినా.. సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్న తర్వాతైనా చిన్న సర్దుబాట్లు కూడా చికాకు తెప్పిస్తాయి. ఇంటిలో కలపతో అల్మరాలు చేస్తున్నప్పుడు.. పనిలో పనిగా టీవీ అమర్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తుంటారు. అప్పటి అవసరాల మేరకు కలప, ఫ్లైవుడ్‌ వినియోగించి ఇరువైపులా ఇంటికి అందాన్ని తెచ్చే బొమ్మలు పెట్టుకునేందుకు సెల్ఫులు నిర్మించి అద్దాలు బిగించేస్తుంటారు. అప్పటి ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా పెద్ద టీవీనే కొంటున్నామని భావించి అంతే వైశాల్యంతో వుడ్‌ వర్కు పూర్తి చేస్తాం. నాలుగైదేళ్లు అయ్యాక ఇంకా పెద్ద టీవీ హాల్‌లో ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అదే స్థలంలో పెద్ద టీవీ పట్టదు.. అలా అని అప్పుడు ముచ్చటపడి చేసుకున్న వుడ్‌వర్కు తొలగించడానికి మనసొప్పదు. ఈ ఇబ్బందులను అధిగమించాలంటే గోడకు టీవీ పెట్టి.. కింద టీవీకి సంబంధించిన సెట్‌టాప్‌ బాక్సు, సౌండ్‌ సిస్టమ్‌లు పెట్టుకోడానికి వీలుగా ప్లాట్‌ఫామ్‌ కట్టుకుంటే సౌకర్యంగా ఉంటుంది. మన ఆర్థిక పరిస్థితులు, అభిరుచులకు అనుగుణంగా పెద్ద ప్లాస్మా టీవీ కొనుక్కొని.. మినీ థియేటర్‌ అనుభూతి పొందాలంటే..

*టీవీ స్టాండ్లు నిర్మించకుండా ఉంటేనే మేలని ఇంటీరియల్‌ డిజైనర్లు చెబుతున్నారు.ః టీవీ స్టాండ్‌ తప్పనిసరిగా ఉండాలని భావిస్తే.. విశాలమైన టీవీ ఏర్పాటుకు అనుగుణంగా పెద్ద స్టాండ్‌ చేయించుకోవడం మేలు.

*పెద్ద టీవీ కొనేప్పుడు లివింగ్‌ రూంలో ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది కూడా ముఖ్యం. విశాలమైన గదుల్లోనే ఇవి అనుకూలం. దూరం నుంచి చూస్తేనే స్పష్టంగా కనిపిస్తాయి. మినీ థియేటర్‌ అనుభూతి కలుగుతుంది. అందుకే టీవీ స్టాండ్‌ చేయించుకునే ముందే ఈ అంశాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts