త్రైమాసికం.. సానుకూలం
ఇళ్ల విక్రయాల్లో 32 శాతం వృద్ధి
కార్యాలయాల లీజుల్లో ప్రతికూలం
ఈనాడు, హైదరాబాద్
పండగల వేళ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థలు శుభవార్తను మోసుకొచ్చాయి. జులై-సెప్టెంబరు నెలల్లో గత ఏడాదితో పోలిస్తే ఇళ్ల విక్రయాలు పెరిగాయని తమ నివేదికల్లో వెల్లడించాయి. మార్కెట్ స్తబ్దుగా ఉందంటున్న తరుణంలో తాజా నివేదికలు పరిశ్రమల వర్గాలకు సరికొత్త హుషారునిచ్చాయి.
హైదరాబాద్‌లో గత త్రైమాసికంలో 32 శాతం వార్షిక వృద్ధి కన్పించిందని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. క్రితం త్రైమాసికంలో 7900 ఇళ్లను విక్రయించగా, గత ఏడాది ఇదే సమయంలో 5,987 యూనిట్లు మాత్రమే విక్రయించగలిగారు. అహ్మదాబాద్, ముంబయి తర్వాత అత్యధిక వృద్ధి ఇక్కడే కన్పించింది.
* కొత్త ప్రాజెక్టుల విషయానికి వస్తే గత ఏడాది 9256 యూనిట్లను ప్రారంభిస్తే.. ఈసారి సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఏకంగా 11 వేల యూనిట్లు కలిగిన ప్రాజెక్టులు ప్రారంభించారు. 19 శాతం వృద్ధి నమోదైంది.
ఇళ్ల ధరల్లోనూ వృద్ధి.. ఇళ్ల ధరలు ఏడాది కాలంలో 6 శాతం పెరిగాయి. త్రైమాసిక వృద్ధి మాత్రం 1 శాతమే నమోదైంది. ఇళ్లు కొనాలనుకునేవారికి ఇది కొంత ఊరటే.
* దిల్లీ రాజధాని ప్రాంతం, బెంగళూరులో ధరల వార్షిక వృద్ధి 8 నుంచి 10 శాతంగా ఉంది.
లీజుల్లో భారీ తగ్గుదల
పలు అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌ల ఏర్పాటుకు మొగ్గు చూపుతుండటంతో కార్యాలయాల లీజింగ్ ఎలా ఉందనేది ఆసక్తి కలిగించే అంశం. 0.8 మిలియన్ చదరపు అడుగుల లావాదేవీలు జరిగినా.. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఏకంగా 2.1 మిలియన్ చదరపు అడుగుల లావాదేవీలు అయినట్లు నివేదికలో పేర్కొంది. ఇక్కడ 60 శాతం తగ్గుదల నమోదైంది.
* బెంగళూరు ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఇక్కడ 7.3 మిలియన్ చదరపు అడుగుల లీజుల లావాదేవీలు జరిగాయి. దేశం మొత్తంలో లీజింగ్‌కు ఇది దాదాపు సమానం.
* కార్యాలయ భవనాల నిర్మాణం పూర్తయినవి గత ఏడాది జులై-సెప్టెంబరు కాలంలో 2.2 మిలియన్ చదరపు అడుగులు ఉంటే.. ఈసారి ఏకంగా 3.3 మిలియన్ చ.అ.లకు పెరిగింది. ఇక్కడ 51 శాతం పెరుగుదల నమోదైంది.
* కార్యాలయాల అద్దెల్లో 7 శాతం వార్షిక వృద్ధి, 2 శాతం త్రైమాసిక వృద్ధి నమోదైంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Krishna Tribunal: కొత్త కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా? వద్దా?.. అభిప్రాయం తెలిపేందుకు ఏజీ నిరాకరణ
-
India News
Parliament: అదానీ ఎఫెక్ట్.. సోమవారానికి వాయిదా పడిన ఉభయ సభలు
-
World News
Putin: 80 ఏళ్ల తర్వాత.. మళ్లీ సరిహద్దుల్లో వారి ట్యాంకులు..!
-
General News
TTD: తిరుమలలో ఆటోమేటిక్ యంత్రాలతో లడ్డూ తయారీ!
-
India News
SC: ఆ రికార్డులు సమర్పించండి.. బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు
-
Politics News
TS Assembly: ‘ఎందుకు రావట్లేదు’- కేటీఆర్... ‘పిలిస్తే కదా వచ్చేది’- ఈటల