కోకాపేట... నయానగరం!
ఈనాడు, హైదరాబాద్: అవుటర్ పక్కనే కోకాపేటలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) తలపెట్టిన భారీ లేఅవుట్ పనులు దాదాపు కొలిక్కి వచ్చాయి. సుమారు 531 ఎకరాల్లో ఈ భారీ లేఅవుట్‌కు గతంలోనే శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అనుసంధాన రహదారులు, అంతర్గత రోడ్లు సహా అవుటర్ రింగ్‌రోడ్డుతో కలిపే వంతెనలు, మురుగు, తాగునీరు.. ఇతర మౌలికవసతుల కోసం హెచ్‌ఎండీఏ రూ.250 కోట్లు వరకు కేటాయించింది. ఇప్పటికే అంతర్గత దారులు, అప్రోచ్ రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ లేఅవుట్‌లోనే నియోపోలీస్ పేరుతో 108 ఎకరాలను 7 బడా నిర్మాణ సంస్థలు వేలం ద్వారా ఇటీవల దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడా హెచ్‌ఎండీఏ మౌలిక వసతులను శరవేగంగా కల్పిస్తోంది. ఇందులో ఓ నిర్మాణ సంస్థ 48 అంతస్తుల్లో భారీ అపార్ట్‌మెంట్ నిర్మాణానికి ఇప్పటికే శ్రీకారం చుట్టింది. మిగతా సంస్థలూ అదేదిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో అవుటర్ పక్కనే ఈ నయా నగరం రూపుదిద్దుకుంటోంది. ఈ లేఅవుట్ నుంచి నేరుగా అవుటర్‌పైకి వాహనాలు వెళ్లేలా ప్రత్యేక ఇంటర్‌ఛేంజ్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. లేఅవుట్ నుంచి మరో నాలుగు వరకు అనుసంధాన దారులు నిర్మిస్తున్నారు. అవుటర్ రింగ్ రోడ్డులో చేపట్టిన ఇంటర్‌ఛేంజ్ పనులను చాలామేరకు పూర్తిచేశారు. మూవీ టవర్స్‌కు కేటాయించిన భూమి వద్ద కొంత వివాదం తలెత్తడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. లేఅవుట్‌లో నివాస సముదాయాలే కాకుండా...బహుళ అంతస్తుల్లో వాణిజ్య భవనాలూ రానున్నాయి. ప్రస్తుతం ఈ లేఅవుట్ చెంతనే అంతర్జాతీయ ప్రమాణాలతో 23 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్ రానుంది. మార్చిలో దీన్ని అందుబాటులోకి తేనున్నారు. ఐటీ కారిడార్‌లో హెచ్‌ఎండీఏ భారీ లేఅవుట్ తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో స్థానికంగా అభివృద్ధి మరింత వేగంగా కొనసాగనుంది. గతంలో ఈ లేఅవుట్ వేలంలో ఎకరాకు రూ.14 కోట్ల వరకు పలికిన సంగతి తెలిసిందే. దీంతో హెచ్‌ఎండీఏకు భారీ ఆదాయం సమకూరింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Nagababu: ‘ఆరెంజ్’ రీ రిలీజ్.. వసూళ్ల విషయంలో నాగబాబు వినూత్న నిర్ణయం
-
General News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో మరో ఇద్దరికి అధిక మార్కులు.. సిట్ దర్యాప్తులో వెల్లడి
-
India News
Vijay Mallya: అప్పు చెల్లించకుండా.. విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేశారు: మాల్యాపై సీబీఐ తాజా ఛార్జ్‌షీట్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
XBB.1.16: కొవిడ్ తాజా విజృంభణకు ఈ వేరియంట్ కారణమా..?
-
Movies News
ott movies: ఈ వారం ఓటీటీలో 18 చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు