ఫ్లాటా... విల్లానా...
విశాలమైన విల్లా కొనుగోలుచేయాలా? చిన్నదైనా ఫ్లాట్‌తోనే సరిపెట్టుకోవాలా?
వ్యక్తిగత అభిరుచులు.. జీవనశైలి ఇంటి కొనుగోలులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఒకరు ప్రశాంతంగా ఉండే చోట నివసించాలనుకుంటే.. మరొకరు చుట్టూ హడావుడి ఉండే వాతావరణం కావాలని కోరుకుంటుంటారు. కొన్నిసార్లు అవసరాలను బట్టి కూడా నిర్ణయాలు మార్చుకోవాల్సి ఉంటుంది.ఏ అవసరమైనా దానికి తగ్గ ఇళ్లు హైదరాబాద్‌లో అందుబాటులో ఉండటం విశేషం.
ధరే నిర్ణయిస్తుంది..
ఇంటి కొనుగోలులో ఎవరికెన్ని ఆలోచనలు ఉన్నా అంతిమంగా ఏది కొనాలనేది కొనుగోలుదారుడి బడ్జెట్ నిర్ణయిస్తుంది.
* తమకు కావాల్సిన ప్రదేశంలో సాధారణంగా ఫ్లాట్‌తో పోలిస్తే విల్లా ఖరీదు ఎక్కువ ఉంటుంది. వ్యక్తిగత ఇంటికి కూడా ఎక్కువే పెట్టాల్సి వస్తుంది.
* వ్యక్తిగత ఇళ్లలో తక్కువ నిర్వహణ ఖర్చులు ఉన్నప్పటికీ.. ఫ్లాట్, విల్లాలో ఈ ఖర్చులు ఎక్కువ ఉంటాయి.
* గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లలో.. విల్లాలలో గార్డెనింగ్, ఈత కొలను, ఆటస్థలాలు, క్లబ్‌హౌస్ సౌకర్యాలతో నిర్వహణ ఖర్చులు ఇంకా ఎక్కువే ఉంటాయి.
దేనికదే...
నగరంలో బహుళ అంతస్తులు ఎక్కువగా జనావాసాల నడుమనే కడుతున్నారు. చాలావరకు సామాజికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే ఇవి అందుబాటులో ఉన్నాయి. సిటీ బయట కూడా వస్తున్నాయి. మొత్తంగా కొనుగోలుదారులకు ఫ్లాట్ల ఎంపికకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
* ఫ్లాట్ ఉన్న చోట చుట్టుపక్కల పాఠశాలలు, ఆసుపత్రులు, కార్యాలయాలకు సౌకర్యంగా ఉంటుంది.
* అదే విల్లా అయితే అధికశాతం శివారు ప్రాంతాల్లో ఉన్నాయి. అవుటర్ కేంద్రంగా ఈ ప్రాజెక్టులు చాలావరకు కడుతున్నారు.
* వ్యక్తిగత ఇళ్లు సైతం ఇన్నర్ రింగ్ రోడ్డు బయట.. అవుటర్ లోపల పంచాయతీల్లో అందుబాటులో ఉన్నాయి. వీటి చుట్టుపక్కల సౌకర్యాలన్నీ అందుబాటులోకి వచ్చేవరకు కొంత సమయం ఎదురు చూడాల్సి ఉంటుంది.
నచ్చినట్లుగా..
* ఫ్లాట్లలో ఆరు వందల చ.అడుగుల నుంచి 16వేల చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఒక పడక గది నుంచి ఆరు పడక గదుల వరకు నిర్మాణదారులు కడుతున్నారు. ఎంత విశాలమైనప్పటికీ ఫ్లాట్ అనగానే ఇరుకిరుకు అనే భావన ఉంటుంది. చిన్న కుటుంబాలకు అనువుగా ఉంటాయి. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్థులైతే ఎక్కువ సమయం బయటే కాబట్టి వీరికి ఫ్లాట్ అనువుగా ఉంటుంది.
* పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబాలు ఉన్నవారు వ్యక్తిగత ఇల్లు, విల్లాలవైపు మొగ్గు చూపవచ్చు. కుటుంబ సభ్యులకు స్వేచ్ఛ కూడా ఇక్కడ ఎక్కువే లభిస్తుంది. పెట్టుబడి దృష్ట్యా సైతం వీటిని కొనుగోలు చేయవచ్చు. తమకు నచ్చినట్లుగా ఇంటిని మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. నచ్చినట్లుగా జీవించవచ్చు.
భద్రతకు పెద్దపీట..
* శివార్లలో వ్యక్తిగత గృహాలు, విల్లాలు విసిరేసినట్లుగా ఉంటాయి. ఇక్కడ అభివృద్ధి చెందాలంటే మరికొంత సమయం పడుతుంది. గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు, బహుళ అంతస్తుల్లో మూడంచెల వ్యవస్థ ఉంటుంది. రెండింట్లోనూ సానుకూల, ప్రతికూల అంశాలు ఉన్నాయి.
* ఇల్లు కొనేటప్పుడు అత్యవసరాల్లో అమ్మితే సొమ్ము తిరిగి వస్తుందా? పునఃవిక్రయ విలువ ఉంటుందా అనేది కూడా ఆలోచిస్తుంటారు. ఫ్లాట్లు సాధారణంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి వీటికి ఢోకా లేదు. తగిన అద్దెలు కూడా వస్తాయి. విల్లాలో పెట్టుబడికి ఢోకా లేనప్పటికీ.. ఒకవేళ అక్కడ ఉండలేకపోతే అద్దెలపైన స్పష్టత లేదు. ఇప్పుడిప్పుడే వీటిని నిర్వహించే కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయి. కొన్ని ప్రాజెక్టుల్లో అయితే వారే అద్దె చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు.
టౌన్‌షిప్ పాలసీ ఏం చెబుతోంది...
అవుటర్ రింగ్ రోడ్డు ఆవల టౌన్‌షిప్పుల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వీటి నిర్మాణాలకు ఊపందుకున్నాయి. వీటి నిర్మాణం కోసం హెచ్‌ఎండీఏ ప్రత్యేక పాలసీ రూపొందించింది.
* అవుటర్ రింగ్ రోడ్డుకు 5 కిలోమీటర్ల అవల టౌన్‌షిప్పులు ఉండాలి
* కనీసం 100 ఎకరాల్లో నిర్మించాలి
* నివాస, వాణిజ్య, ఎల్‌ఐజీ, ఆసుపత్రులు, పాఠశాలలు, రవాణా సౌకర్యాలు...ఇలా అన్ని అవసరాలకు భూ కేటాయింపులు
తప్పనిసరి
* మొత్తం బిల్డప్ ఏరియాలో 10 శాతం హెచ్‌ఎండీఏ వద్ద మార్టిగేజ్(తనాఖా) పెట్టాలి. టౌన్‌షిప్పు పూర్తి స్తాయిలో అభివృద్ధి చేసిన తర్వాత దీనిని హెచ్‌ఎండీఏ రిలీజ్ చేస్తుంది.
* అన్ని భవనాలు, అపార్ట్‌మెంట్లు, హైరైజ్డ్, టౌన్‌షిప్పుల నిర్మాణానికి దరఖాస్తులను డీపీఎంఎస్(గ్రామ పంచాయతీలు మాత్రమే) మిగతా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు టీఎస్‌బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నిర్ణీత సమయంలో దరఖాస్తు పరిశీలించి అనుమతులు జారీ చేస్తారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Rohit - IPL: ఐపీఎల్లో ఆటగాళ్ల పనిభారంపై ఫ్రాంచైజీలదే బాధ్యత: రోహిత్ శర్మ
-
Movies News
Social Look: సారా అలీఖాన్ ‘పింక్’ మూడ్.. తుపాకీ పట్టిన లక్ష్మీరాయ్!
-
Crime News
Hyderabad: అంగట్లో అమ్మకానికి 16.8 కోట్ల మంది డేటా.. ఆరుగురి అరెస్టు
-
General News
Polavaram: ‘పోలవరం’ ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం: కేంద్రం
-
Movies News
Shakuntalam: అప్పటి నుంచే నా సినిమాల్లో నిజమైన బంగారు ఆభరణాలు వాడుతున్నా: గుణశేఖర్
-
Politics News
Revanth Reddy: లీకేజీ వ్యవహారం.. కేటీఆర్ నుంచి ఎందుకు సమాచారాన్ని సేకరించలేదు?: రేవంత్