భవిష్యత్తుపై భరోసా... విస్తరణపై ధ్యాస

శివార్లలో మరిన్ని భారీ రియల్‌ఎస్టేట్‌ ప్రాజెక్టులు రాబోతున్నాయి. పలు ప్రముఖ సంస్థలు ఈ ఏడాది ద్వితీయార్థంలో, వచ్చే ఏడాది వీటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

Published : 13 May 2023 03:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: శివార్లలో మరిన్ని భారీ రియల్‌ఎస్టేట్‌ ప్రాజెక్టులు రాబోతున్నాయి. పలు ప్రముఖ సంస్థలు ఈ ఏడాది ద్వితీయార్థంలో, వచ్చే ఏడాది వీటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. హైదరాబాద్‌ భవిష్యత్తుపై భరోసాతో పెద్ద సంస్థలు, దేశంలోని ఇతర సంస్థలు వ్యాపార విస్తరణపై ధ్యాసపెట్టాయి. ఐటీ కారిడార్‌కు కొనసాగింపుగా ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువగా కొత్త ప్రాజెక్టుల ప్రణాళికలున్నాయి. రియల్‌ ఎస్టేట్‌లో ‘డార్లింగ్‌’గా పిలుచుకునే ఈ ప్రాంతంలోనే డజనుకుపైగా సంస్థలు విస్తరణ ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ సంస్థలకు చెందిన ప్రాజెక్ట్‌లు ఇప్పటికే ఇక్కడ నిర్మాణంలో ఉన్నాయి. ఇవి పూర్తికాకముందే కొత్తవాటిని ఆరంభించే యోచనలో ఉన్నాయి.

తెల్లాపూర్‌, కోకాపేటలో రెండు సంస్థలు కట్టే అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లే 5500 పైన రాబోతున్నాయి. 43-47 అంతస్తుల్లో మొత్తం 15 టవర్లు రాబోతున్నాయి. దాదాపు రూ.4 వేల కోట్ల టర్నోవర్‌ ఇక్కడ జరగబోతుంది.

గచ్చిబౌలి, కోకాపేటలో రెండు ప్రాజెక్టులు చేస్తున్న మరో సంస్థ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలో ఇంకొకటి ప్రారంభించబోతుంది.

హైదరాబాద్‌ మార్కెట్లోకి అడుగుపెట్టిన చెన్నై రియల్‌ ఎస్టేట్‌ ఇక్కడ విస్తరణపై దృష్టి పెట్టింది. 2024 నాటికి ఏకంగా 5 మిలియన్‌ చదరపు అడుగుల ప్రాజెక్ట్‌లతో రూ.3 వేల కోట్ల టర్నోవర్‌ చేయబోతున్నట్లు వెల్లడించింది. ఇవి కూడా 40 అంతస్తులపైనే రాబోతున్నాయి.

డిమాండ్‌ ఉందా?: మార్కెట్లో ఇప్పటికే సరఫరా అధికంగా ఉందని కొందరు బిల్డర్లు అంటున్నారు. డిమాండ్‌కంటే సరఫరా పెరగడంతో ఇన్వెంటరీ పెరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. అయితే రియల్‌ఎస్టేట్‌లో మార్కెట్‌ అనేది ప్రాంతాన్నిబట్టి, నిర్మాణసంస్థ విశ్వసనీయతనుబట్టి కూడా తేడాలుంటాయని మరో బిల్డర్‌ అన్నారు. గచ్చిబౌలిలో ఒకలా ఉంటే.. ఉప్పల్‌ వైపు మరోలా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆయా సంస్థల మార్కెటింగ్‌, ఫ్లాట్‌ ధర, లక్షిత కొనుగోలుదారులు.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు. వీటిని బేరీజు వేసుకున్నాకే కొత్త ప్రాజెక్టులు చేపడుతుంటాయన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు