త్రీడీ విచిత్రం గవాక్షం అద్భుతం

కిటికీల రూపురేఖలు మారిపోతున్నాయి. త్రీడీ డిజిటల్‌ ప్రింట్లతో డిజైనర్లు అద్భుతాలు చేస్తున్నారు.

Published : 25 May 2024 01:11 IST

ఈనాడు, హైదరాబాద్‌ : కిటికీల రూపురేఖలు మారిపోతున్నాయి. త్రీడీ డిజిటల్‌ ప్రింట్లతో డిజైనర్లు అద్భుతాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని చూస్తుంటే ఇంట్లో కిటికీలోంచి స్టేడియం పరిసరాలు కన్పిస్తున్నట్లుగా ఉంది కదూ! వాస్తవానికి యూపీవీసీ విండో గ్లాస్‌పై వేయించిన త్రీడీ డిజిటల్‌ ప్రింట్‌ ఇది. ఇలా మనకు కావాల్సినవి కిటికీ అద్దాలపై వేయించుకోవచ్చు అని ఇంటీయర్‌ డిజైనర్లు చెబుతున్నారు. కేవలం కిటికీల దగ్గరే కాదు ఇంట్లో ఖాళీగా ఉండే సిట్‌ అవుట్‌ ప్రదేశాల్లోనూ ఆహ్లాదకరంగా ఉండేలా కిటికీలను డిజైన్‌ చేసుకోవచ్చు అంటున్నారు. అలాంటి డిజైన్‌ విండోనే ఇది. ఇటీవల హైటెక్స్‌లో ఐజీబీసీ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో తీసిన చిత్రమిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని