దక్షిణ నైరుతిలో మరుగుదొడ్డి ఉండవచ్చా..

దక్షిణంలో మరుగుదొడ్డి, నైరుతి వైపు సెప్టిక్‌ ట్యాంకు ఉండటం వాస్తు రీత్యా విరుద్ధం. ఆర్థిక స్థోమత ఉంటే వాటిని మార్చుకోవడం ఉత్తమం. లేకపోతే ఈశాన్యంలో, తూర్పులో, ఉత్తరంలో ...

Published : 14 Jun 2016 22:34 IST

దక్షిణ నైరుతిలో మరుగుదొడ్డి ఉండవచ్చా..

మా ఇంటికి దక్షిణ నైరుతి భాగంలో మరుగుదొడ్డి, సెప్టిక్‌ ట్యాంక్‌ ఉన్నాయి. ఇలా ఉంటే ఏమైనా దోషమా?

- నరహరి, హైదరాబాద్‌

దక్షిణంలో మరుగుదొడ్డి, నైరుతి వైపు సెప్టిక్‌ ట్యాంకు ఉండటం వాస్తు రీత్యా విరుద్ధం. ఆర్థిక స్థోమత ఉంటే వాటిని మార్చుకోవడం ఉత్తమం. లేకపోతే ఈశాన్యంలో, తూర్పులో, ఉత్తరంలో నీటి నిల్వ ట్యాంకును నిర్మించుకోవాలి. ఇది సెప్టిక్‌ ట్యాంకు కంటే ఒక అడుగు ఎక్కువ లోతు ఉండేట్లు చూసుకోవాలి. నైరుతి మరుగుదొడ్డిని ఆగ్నేయం, పడమరకు మార్చుకోవాలి. లేకపోతే నైరుతి దిక్కుదేవతలను, మత్స్య యంత్రాలను ప్రతిష్ఠించుకోవటం వల్ల ఆ దోషం పోతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని