మూడో అంతస్తులో ఉండవచ్చా..?

ఇంటిపై నిర్మించే అంతస్తులుగానీ లేదా ఆధునిక కాలంలో హైరైజ్డ్‌ అపార్టుమెంట్లు వస్తున్నాయి. ఇలా నిర్మించేటప్పుడు కొంతమందికి సందేహాలు వస్తున్నాయి. అటువంటివేమీ అక్కర్లేదు. చక్కగా మీకు ఇష్టమైన.....

Published : 18 Jun 2016 22:42 IST

మూడో అంతస్తులో ఉండవచ్చా..?

ప్ర: అపార్టుమెంట్‌, స్వతంత్ర గృహాల్లో మూడో అంతస్తులో నివాసం ఉండవచ్చా?

- రమేశ్‌చంద్ర, హైదరాబాద్‌

* ఇంటిపై నిర్మించే అంతస్తులుగానీ లేదా ఆధునిక కాలంలో హైరైజ్డ్‌ అపార్టుమెంట్లు వస్తున్నాయి. ఇలా నిర్మించేటప్పుడు కొంతమందికి సందేహాలు వస్తున్నాయి. అటువంటివేమీ అక్కర్లేదు. చక్కగా మీకు ఇష్టమైన.. మీకు దొరికే ఫ్లోర్‌లో ఎక్కడైనా నివాసం ఉండొచ్చు. నివాసం ఉండే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటంటే.. మీ నామ నక్షిత్రాలను అనుసరించి ఏ కార్నర్‌ ప్లాట్‌ అనుకూలమైతే దాన్ని ఎంచుకోండి. ఆ ఫ్లాట్‌ కూడా చతురస్ర లేదా దీర్ఘచతురస్రాకారంగా ఉండాలి. ఎక్కువ అంతస్తులు నిర్మించేటప్పుడు కింద అంతస్తులు చతురస్ర, దీర్ఘచతురస్రాకారాల్లో నిర్మించి, పై అంతస్తులు ఎల్‌ లేదా యు ఆకారాల్లో నిర్మిస్తే మంచిది కాదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని