నైరుతిలో గేటుని వాడుకోవచ్చా?

* అపార్టుమెంట్ల సెల్లార్‌లను పార్కింగ్‌కి ఇస్తున్నారు. ఈ పార్కింగ్‌కు రోడ్డు నుంచి లోపలికి వెళ్లేటప్పుడు ఇన్‌, అవుట్‌ గేట్లు పెట్టుకోవడం సంప్రదాయం. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ శాతం పడమర రోడ్లు ఉన్నవారికి వాయువ్య భాగాన్ని ఇన్‌, నైరుతి భాగాన్ని అవుట్‌గా.. లేకపోతే నైరుతిని ఇన్‌...

Published : 15 Jul 2016 23:29 IST

నైరుతిలో గేటుని వాడుకోవచ్చా?

మా అపార్టుమెంట్‌ ఎడమ వైపు ప్రహరీగోడకు మూడు గేట్లు ఉన్నాయి. మేము నైరుతిలో ఉన్న గేటు వాడుతున్నాం. ఇలా వాడొచ్చా?

- సుకన్య, హైదరాబాద్‌

* అపార్టుమెంట్ల సెల్లార్‌లను పార్కింగ్‌కి ఇస్తున్నారు. ఈ పార్కింగ్‌కు రోడ్డు నుంచి లోపలికి వెళ్లేటప్పుడు ఇన్‌, అవుట్‌ గేట్లు పెట్టుకోవడం సంప్రదాయం. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ శాతం పడమర రోడ్లు ఉన్నవారికి వాయువ్య భాగాన్ని ఇన్‌, నైరుతి భాగాన్ని అవుట్‌గా.. లేకపోతే నైరుతిని ఇన్‌, వాయువ్య భాగాన్ని అవుట్‌గా పెడుతున్నారు. అది కూడా కొంతవరకు దోషమే. నైరుతి గేటు లేకపోవడం ఉత్తమం. వాయువ్య, పడమర భాగాల్లో మాత్రమే గేట్లు ఉంచుకోవడం మంచిది. మూడు గేట్లు నిషేధం. ఏ దిక్కునైనా ఒకటి లేదా రెండు గేట్లు పెట్టుకోవచ్చు. ఇవేవీ కుదరని పక్షంలో... వాయువ్య భాగంలో ఉన్న గేటును ఎక్కువగా వాడాలి. నైరుతి గేటును అప్పుడప్పుడూ, తప్పనప్పుడు ఉపయోగించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని