ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ తూర్పులో ఉండవచ్చా?

మనం ఇంటినిర్మాణం చేపట్టినప్పుడే.. గ్రౌండ్‌ఫ్లోర్‌ కట్టుకున్న తర్వాత నీటి సంపులను ఉత్తర ఈశాన్య తూర్పు భాగాల్లో నిర్మించుకోవాలి. పైన నిర్మించే ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లు పడమర వైపు....

Published : 30 Aug 2016 20:23 IST

ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ తూర్పులో ఉండవచ్చా?

  మా ఇంటి మొదటి అంతస్తులో తూర్పువైపు ఇంటిని నిర్మించి పడమరవైపు ఖాళీగా ఉంచాం. ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ తూర్పువైపు ఉంది.. ఇలా ఉండొచ్చా?

- రమేశ్‌, గుంటూరు

మనం ఇంటినిర్మాణం చేపట్టినప్పుడే.. గ్రౌండ్‌ఫ్లోర్‌ కట్టుకున్న తర్వాత నీటి సంపులను ఉత్తర ఈశాన్య తూర్పు భాగాల్లో నిర్మించుకోవాలి. పైన నిర్మించే ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లు పడమర వైపు ఉండేలా చూసుకోవాలి. ఆధునిక కాలంలో నైరుతిలో బరువు ఉండాలని చెప్పి అక్కడే ఓవర్‌హెడ్‌ ట్యాంకులు ఉంచుతున్నారు. అది మంచిది కాదు.

అదేవిధంగా మొదటి అంతస్తు నిర్మాణం చేసేప్పుడు.. దక్షిణ, పడమర గోడలను హద్దుగా తీసుకొని మాత్రమే మొదటి అంతస్తును నిర్మించాలి తప్ప తూర్పు హద్దుపై కట్టవద్దు. ఇలాచేస్తే గృహ యజమానులకు మంచిదికాదు. వీలైతే ఆ పడమర భాగాన్ని కూడా శ్లాబ్‌ లేదా షీట్ల ద్వారా ఎక్స్‌టెన్షన్‌ చేసుకొని ఆ తూర్పువైపు ఉన్న ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ను పడమర వైపునకు మార్చుకోవడం మంచిది. అలా వీలుకాకపోతే.. తూర్పు, పడమర దిక్కుల్లో మిగిలిన దిక్కులకు సంబంధించిన యంత్రాలను ప్రతిష్టించుకొంటే కొంతవరకు దోష పరిహారమవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని