సింహ ద్వారం ఏ దిక్కున?

స్థలం, ఇల్లు కొనేవారు ముందుగా ఆలోచించేది ఏ దిక్కుకు అభిముఖంగా ఉందనేదే.. ఆ తర్వాతే విస్తీర్ణం, ఇల్లు ఎలా ఉంది? తమ స్తోమతకు తగ్గట్టుగా ఉందా? సౌకర్యాలు, నీటి వసతి, డ్రైనేజీ సదుపాయాల్లాంటివి చూస్తుంటారు. దీంతో పాటు ఆ పరిసరాల్లో కొంటే భవిష్యత్తులో పెరిగే డిమాండ్‌ తదితర విషయాలను చూస్తుంటారు.

Published : 30 Sep 2017 01:35 IST

సింహ ద్వారం ఏ దిక్కున?
ఈనాడు, హైదరాబాద్‌ 

స్థలం, ఇల్లు కొనేవారు ముందుగా ఆలోచించేది ఏ దిక్కుకు అభిముఖంగా ఉందనేదే.. ఆ తర్వాతే విస్తీర్ణం, ఇల్లు ఎలా ఉంది? తమ స్తోమతకు తగ్గట్టుగా ఉందా? సౌకర్యాలు, నీటి వసతి, డ్రైనేజీ సదుపాయాల్లాంటివి చూస్తుంటారు. దీంతో పాటు ఆ పరిసరాల్లో కొంటే భవిష్యత్తులో పెరిగే డిమాండ్‌ తదితర విషయాలను చూస్తుంటారు.
కొన్ని దశాబ్దాల కాలంగా వాస్తు శాస్త్రం గురించి చాలామంది ఆలోచిస్తూ శాస్త్రానుగుణంగా ఇల్లు కట్టుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. కుటుంబ సభ్యులు తమ అవసరాల రీత్యా వినియోగించుకోవాలనే దృక్పథం పెరిగింది. దీనిలో మూఢ నమ్మకం కంటే శాస్త్రీయ దృక్పథం ఇమిడి ఉందని గ్రహించడంతో పలువురు స్థిరాస్తి వ్యాపారులు అందుకు అనుగుణంగా స్థలాల విభజన చేస్తున్నారు. ఇంటి నిర్మాణాలు కూడా శాస్త్రప్రకారం కడుతున్నారు.
పన్నెండుగా చూడాలి..
సాధారణంగా దిక్కుల విషయానికి వచ్చేసరికి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులు ప్రధానంగా చూస్తారు. వాస్తవానికి దిక్కులను 12గా చూడాలి. తూర్పు ఈశాన్యం, తూర్పు, తూర్పు ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం, దక్షిణం, దక్షిణ నైరుతి, పడమర నైౖరుతి, పడమర, పడమర వాయువ్యం, ఉత్తర వాయువ్యం, ఉత్తరం, ఉత్తర ఈశాన్యంగా చూడాలి.
ఆ నాలుగు తప్ప
ఎక్కువ భాగం స్థలాలు ప్రధానంగా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ దిక్కులకు అభిముఖంగా ఉంటాయి. ఆ దిశలలో రాకపోకలు సాగిస్తుంటారు. ఇంటి విషయానికి వచ్చేసరికి పడమర నైరుతి, దక్షిణ నైరుతి, తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయువ్యం ద్వారం లేకుండా చూసుకోవాలి. మిగిలిన ఎనిమిది దిశలలో ముఖద్వారం ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుంది.
చిన్న మార్పులతో..
ఒక్కొక్కరికి పేరు బలం, జన్మరాశి ప్రకారం ఏ దిశ స్థలం ఉన్నతిగా ఉంటుందనేది శాస్త్రంలో చెబుతుంటారు. ఈ మేరకు కొనే స్థలంలో ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రణాళిక చేసుకోవచ్చు. ఒకే పేరు, జన్మరాశి ఉన్నవారు ఒకే దిశలో నివసిస్తున్నప్పటికీ ఒకే రకమైన ఫలితాలు ఉండకపోవచ్చు. ఆయా ఇంటిని, గదులను వాడుకునే విధానంలో మార్పులు ఉండడం ఓ కారణం. కట్టిన ఇల్లు మనకు అనుకూలంగా లేకపోయినా చిన్నచిన్న మార్పులతో సరి చేసుకోవచ్చని చెబుతున్నారు. 

సర్దుబాటుతో..
నిజానికి దిక్కు ఏదైనా ఉన్న స్థలంలో ఇంటి ప్లాన్‌ వాస్తు ప్రకారం చూసుకుంటారు.
* ఇంటి సింహద్వారం తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర దిక్కులలో ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఇల్లు కట్టుకునే స్థల వైశాల్యం పెద్దదిగా ఉన్నప్పుడు ఈ తరహా ప్రణాళిక సులువే.
* మరి తక్కువ స్థలం ఉంటే? దిగులు పడాల్సిన పనిలేదు. తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, పడమర వాయువ్యం, దక్షిణ ఆగ్నేయంలోనూ సింహద్వారం ఏర్పాటు చేసుకోవచ్చు.
అక్కడి నుంచి ఘుమఘుమలు
వంటగది విషయానికి వచ్చేసరికి తూర్పు దిశలో ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకుంటే వంటగది వీధివైపునకు ఉండాలి.
* వంటగది ముందు భాగంలో ఉంటే ఇబ్బందిగా భావించి వెనకాల ఉండాలని కోరుకునేవారికి పడమర ఇల్లు అనుకూలం.
* ఉత్తరం దిశలో ఉన్న ఇంట్లోనూ వీరికి సౌకర్యమే.

అనుకూలత పెరిగింది

మధ్యకాలంలో స్థలం, ఇల్లు అనే తేడా లేకుండా దిక్కులకు అనుగుణంగా స్థలాలు విభజిస్తుండడం వల్ల వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి అనుకూలత పెరిగింది. ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని శాస్త్రీయంగా చూసినా ఇది అనుకూలమే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని