కొత్త అపార్టుమెంట్‌ కొనేముందు?

మేం కొత్తగా ఓ అపార్ట్‌మెంట్‌ కొందాం అనుకుంటున్నాం. ఇప్పటికే చాలా చోట్లకెళ్లి చూశాం. ఒక్కో చోట బిల్డరు...

Published : 12 Mar 2016 17:04 IST

కొత్త అపార్టుమెంట్‌ కొనేముందు?

మేం కొత్తగా ఓ అపార్ట్‌మెంట్‌ కొందాం అనుకుంటున్నాం. ఇప్పటికే చాలా చోట్లకెళ్లి చూశాం. ఒక్కో చోట బిల్డరు ఒక్కో రకమైన సమాచారం ఇస్తున్నారు. వాళ్లు చెప్పినవి వినడమే తప్ప మేం ఏం అడగాలో తెలియడం లేదు. ‘అన్ని విషయాలు తెలుసుకుని కొనుక్కోకపోతే మోసపోతారు’ అని ఇంట్లో వాళ్లు హెచ్చరిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌ కొనేముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయగలరు.

ప్లాట్‌ కొనేటప్పుడు చాలామంది సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల న్యాయ సంబంధమైన సమస్యలు ఎదుర్కొంటారు. డబ్బు నష్టపోవడం, సరైన సదుపాయాల్లేకుండా బాధలు అనుభవించడం వంటివి జరుగుతూ ఉంటాయి. ప్లాట్‌ కొనేందుకు సిద్ధపడేముందు ప్రధానంగా చేయాల్సింది ఏమిటంటే.. అపార్టుమెంట్‌కు, బిల్డర్‌కు, ల్యాండ్‌ ఓనర్‌కు ఉన్న యాజమాన్య హక్కులను జాగ్రత్తగా పరిశీలించడం. దస్తావేజులు ఎలా ఉన్నాయో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సామాన్యుడు దస్తావేజులన్నీ సరిగ్గా తెలుసుకోవడం కష్టం గనక సివిల్‌ ప్రాక్టిస్‌ చేసే లాయర్‌కు చూపించాలి. దీంతో బిల్డర్‌కు, ఓనర్‌కు క్రయవిక్రయ హక్కులు ఉన్నాయో, లేదో తెలుస్తుంది. క్రయవిక్రయ హక్కులున్నాయని గుర్తించిన తర్వాత ఒరిజినల్‌ డాక్యుమెంట్లు అడిగే బాధ్యత కూడా కొనుగోలుదారులదే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు