ఏయే దస్తావేజులు పరిశీలించాలి?

ఇంటి స్థలం కొనుగోలు చేసే ముందు ఏయే దస్తావేజులు పరిశీలించాలి?

Published : 02 May 2016 04:41 IST

ఏయే దస్తావేజులు పరిశీలించాలి?

ఇంటి స్థలం కొనుగోలు చేసే ముందు ఏయే దస్తావేజులు పరిశీలించాలి?
కొనుగోలుదారుడే జాగ్రత్త వహించాలని చెబుతూ చట్టంలో ‘బయ్యర్‌ బీ వేర్‌’ అని ఉంటుంది.

* మొదట అమ్మే వ్యక్తికి ఉన్న హక్కు పత్రాలు ఏంటీ అని చూడాలి. టైటిల్‌ డీడ్‌, సేల్‌ డీడ్‌, గిఫ్ట్‌ డీడ్‌ డాక్యుమెంట్లను పరిశీలించాలి. వాళ్లు ఏ వ్యక్తి నుంచి కొనుగోలు చేశారనే వివరాలూ ఉంటాయి. ఆ లింక్‌ డాక్యుమెంట్లనూ పరిశీలించాలి. వీటిని సివిల్‌ లా తెలిసిన న్యాయవాది వద్ద తనిఖీ చేయుంచుకోవాలి. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుకు తీసుకెళ్లి తనిఖీ చేసుకోవాలి. రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో ‘సెర్చి’ చేయించుకోవాలి.
* అమ్మకానికి ఉంచిన ఆ ఆస్తిపై హక్కుదారులు ఎవరైనా ఉంటే 15 రోజుల్లో సంప్రదించాలని దిన పత్రికలో ప్రకటన ఇవ్వాలి. ఇలా ఎందుకుఅంటే... తరవాత ఏమైనా న్యాయ పరమైన చిక్కులొస్తే కోర్టులో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
* భూమికి అనుమతులు ఉన్నాయా లేదా అన్నదీ సరి చూసుకోవాలి. వ్యవసాయ భూములను నివాస స్థలాలుగా మార్పు చేయించిందీ లేనిదీ అడిగితెలుసుకోవాలి. నిర్థరించుకోవాలి. లేఅవుట్‌ అప్రూవల్‌ లేకుండా స్థలాలు తీసుకోవడం మాత్రం రిస్క్‌తో కూడిన వ్యవహారం.

- ఎస్‌. ముజిబ్‌ కుమార్‌, న్యాయవాది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని