చట్టం ఏం చెబుతోంది?

ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టా సర్టిఫికెట్‌ని చూపిస్తూ ఓ వ్యక్తి దాని యజమానిగా స్థలం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు... ...

Published : 15 Jul 2016 23:42 IST

చట్టం ఏం చెబుతోంది?

* పట్టా స్థలం కొనుగోలు చేయొచ్చా?
ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టా సర్టిఫికెట్‌ని చూపిస్తూ ఓ వ్యక్తి దాని యజమానిగా స్థలం విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు... కొనుగోలుదారుడు ఆ ఆ సర్టిఫికెట్‌ను తొలుత సవివరంగా చదవాలి. పేదవాళ్ల నివాసం కోసం ప్రభుత్వం ఇచ్చే భూముల పట్టాలైతే వారికి అమ్మే అధికారం లేకుండా పట్టా సర్టిఫికెట్‌లో ఒక క్లాజ్‌ ఉంటుంది. అలాంటి నిషేధం ఉన్న భూమిని కొనుక్కున్న వ్యక్తి మోసపోతాడు.

పట్టా ఇచ్చినప్పుడే ‘15 ఏళ్ల వరకు ఈ స్థలం అమ్మకూడదు’ అనే నిబంధనలూ కొన్నింటిపై ఉంటాయి. ఇలాంటి పరిమిత కాలం నిషేధం ఉన్న స్థలం కొనుక్కోవాలనుకున్న వ్యక్తులూ కలెక్టర్‌ లేదా రెవెన్యూ డివిజన్‌ అధికారికి దరఖాస్తు చేసుకోవాలి. ఆ స్థలం కొనుగోలు చేసేందుకు వారి అనుమతులు వచ్చిన తర్వాతే కొనుగోలు ప్రక్రియ చేపట్టాలి. లేకపోతే మోసపోయే ప్రమాదం ఉంది.

- ఎస్‌. ముజిబ్‌కుమార్‌, న్యాయవాది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని