పెద్ద కార్యాలయాలకు డిమాండ్‌

కార్యాలయాల భవనాల లీజింగ్‌లో గత ఏడాది పెద్ద వాటికే అధిక డిమాండ్‌ కన్పించింది. గ్రేడ్‌ ‘ఎ’ రకమే కాదు విస్తీర్ణం లక్ష చదరపు అడుగులపైన ఉన్నవాటికే ఎక్కువ ఆదరణ లభించింది.

Updated : 25 Mar 2023 00:57 IST

ఈనాడు, హైదరాబాద్‌

కార్యాలయాల భవనాల లీజింగ్‌లో గత ఏడాది పెద్ద వాటికే అధిక డిమాండ్‌ కన్పించింది. గ్రేడ్‌ ‘ఎ’ రకమే కాదు విస్తీర్ణం లక్ష చదరపు అడుగులపైన ఉన్నవాటికే ఎక్కువ ఆదరణ లభించింది. నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో హైదరాబాద్‌లోని పరిస్థితులను విశ్లేషించింది.

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌.. 2022 ఏడాదికి సంబంధించి కార్యాలయ భవనాల లీజింగ్‌లో విస్తీర్ణం పరంగా 53 శాతం లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నవాటిలోనే జరిగాయి. లావాదేవీల సంఖ్య మాత్రం కనిష్ఠంగా 15గా నమోదైంది.

* 50 వేల నుంచి లక్ష లోపు చదరపు అడుగులున్న కార్యాలయాల భవనాల లీజింగ్‌ వాటా 22 శాతంగా ఉంది. ఈ విభాగంలో 22 భవనాలు ఉన్నాయి.

* 50 వేల చదరపు అడుగుల లోపు ఉన్న కార్యాలయాల భవనాలు 25 శాతంగా ఉంది. ఇక్కడ అత్యధిక లావాదేవీలు జరిగాయి. 83 భవనాలు ఈ విభాగంలో లీజింగ్‌ కుదుర్చుకున్నాయి. 

ఐటీ కార్యాలయాలతో.. ఐటీ సంస్థలు విస్తరణ బాట పట్టడం, కొత్తగా మరిన్ని సంస్థలు తమ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొస్తుండటంతో హైదరాబాద్‌లో ఆఫీసు భవనాలకు డిమాండ్‌ స్థిరంగా కొనసాగుతోంది. లక్ష కంటే ఎక్కువ చదరపు అడుగుల భవనాల లీజింగ్‌లో దేశంలోనే అత్యధికంగా ఇక్కడే ఎక్కువ జరిగాయి. పుణె సైతం 53 శాతం వాటాని నమోదు చేసింది. ఈ రెండు నగరాలు అగ్రభాగంలో నిలిచాయి. బెంగళూరు 51 శాతం వాటాతో గట్టి పోటీ ఇవ్వగా.. మిగతా నగరాల్లో ఇందులో సగం వాటానే కల్గి ఉన్నట్లు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. కోల్‌కతాలో లక్షపైన చదరపు అడుగుల విస్తీర్ణం కొనేవారే లేరు.

లావాదేవీల పరంగా వెనుకబాటు..

50వేలు, లక్ష లోపు, లక్షపైన చదరపు అడుగుల విస్తీర్ణం కల్గిన మూడు విభాగాల్లో కలిపి హైదరాబాద్‌లో 120 లావాదేవీలు మాత్రమే జరిగాయి. పుణెలో 240 లావాదేవీలు ఉండగా... బెంగళూరులో ఏకంగా 330 లావాదేవీలు జరిగాయి. చెన్నైలో 175 భవనాల్లో లీజింగ్‌ ఒప్పందాలు కుదిరాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు