వాన నీరు ఈశాన్యం నుంచి బయటికెళ్లాలా?
ఈనాడు, హైదరాబాద్
వేసవి మొదలు కాబోతోంది. ఎండలు పెరిగేకొద్దీ నీటి అవసరాలు పెరుగుతుంటాయి. వానలు సకాలంలో విస్తారంగా కురిస్తే సరే.. లేదంటే నీటి ఎద్దడి తప్పదు. ఇలాంటి పరిస్థితి చాలా ఇళ్లలో ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొన్నదే. వానలు కురిసినప్పుడే ఇంటిపైన పడిన వర్షపు నీటిని ఒడిసి పట్టుకునేలా సంరక్షించుకుంటే కరవు కాలంలోనూ నీటికి ఢోకా ఉండదు. అందుకు వేసవిలోనే ఇంటిని సన్నద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. సంరక్షించుకోగా మిగిలిన నీటిని, ఇంటి ఆవరణలో వర్షపు నీటిని వాస్తుపరంగా ఎటువైపు నుంచి బయటకు వదలాలి అనేదానిపై వివరిస్తున్నారు వాస్తు నిపుణులు పి.కృష్ణాదిశేషు.
ప్రతి మనిషి జీవితంలో ముఖ్యంగా కోరుకునేది స్థిరమైన ఆదాయంతో పాటు తన కుటుంబంతో కలిసి ఉండటానికి, అవసరాలు తీర్చడానికి అనుకూలమైన గృహం. ఇల్లు అనగానే సౌకర్యాలతో పాటు పదికాలాలపాటు నివాసానికి అనుకూలమైనదై ఉండాలి. ఇందులో వాస్తు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇల్లు కాస్త చిన్నదైనా పర్వాలేదుగాని వాస్తు ఉంటే అన్నీ కలిసివస్తాయనేది చాలామంది విశ్వాసం. శాస్త్రపరంగా చూస్తే వాస్తు అవసరమనే నమ్మకం.
* స్థలం వాస్తు ప్రకారం ఉండి.. ఇల్లు వాస్తు మేరకు కట్టినా సరిపోదు.. వాస్తు ఫలితాలు పొందాలంటే వాడుకునే విధానం కూడా వాస్తు నియమాలకు అనుగుణంగా ఉండాలి. అప్పుడే మనకు సంతృప్తినిచ్చే అనుభవాలు పొందడానికి వీలవుతుంది.
* ఇంటి ఆవరణలో పడిన వర్షపు నీటితోపాటు రోజువారీ కాలకృత్యాలకు వాడిన నీరు ఇంటికి ఈశాన్యం నుంచే బయటకు వెళ్ళడానికి ఏర్పాట్లు ఉండాలి అంటారు. ఆచరణలో చూసినప్పుడు అన్ని దిక్కుల ఇళ్ల వారికి ఈ నియమం సాంకేతికంగా అనుకూలించదు.
* వాస్తు శాస్త్రాన్ని, ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు తూర్పు ఉత్తర దిశలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నప్పటికీ పడమర దక్షిణ దిక్కులకూ ఇతరత్రా మేలు చేస్తుందనేది వాస్తు పండితుల మాట. వాయవ్యం ఆగ్నేయం మూలలనుంచి తగినంత ఫలితాలు పొందవచ్చు. కొన్ని మార్పులు, సర్దుబాట్లు, నిబంధనలు పాటించడం అవసరం.
* వాస్తు శాస్త్రరీత్యా తూర్పు ఉత్తర దిక్కుల మధ్య ఈశాన్యం దిశ మూలల నుంచి రెండు వైపులా చూసినప్పుడు అటు తూర్పుఈశాన్యం ఇటు ఉత్తరఈశాన్యం అంటారు. రెండు దిక్కులకు ఉత్తమ ఫలితాలను ఇస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.
* తూర్పు దక్షిణం మధ్య ఉండే స్థలం ఆగ్నేయం. రెండు వైపుల చూస్తే తూర్పు వైపున తూర్పు ఆగ్నేయం పడమర వైపున పడమర ఆగ్నేయం అవుతుంది. తూర్పు ఆగ్నేయం ప్రతికూల ఫలితాలను ఇస్తే దక్షిణ ఆగ్నేయం మంచి ఫలితాలను ఇస్తుంది.
* ఉత్తరం పడమర మధ్యలో ఉన్నది వాయవ్యం అంటారు. ఉత్తర వాయవ్యం వాస్తురీత్యా ప్రతికూల ఫలితాలను ఇస్తే పడమర వాయవ్యం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
* ఇక ఇంటికి నాలుగో మూల పడమర దక్షిణం దిక్కుల మధ్యభాగాన్ని రెండుగా చూసినప్పుడు అటు దక్షిణ నైరుతి ఇటు పడమర నైరుతి రెండూ చెడు ఫలితాలు ఇస్తాయని పెద్దలు, అనుభవజ్ఞులు, వాస్తుశాస్త్ర సిద్ధాంతులు చెబుతున్నమాట.
విశాలంగా ఉంటే..
విశాలమైన భవనమైతే పైన చెప్పిన మూలలతోపాటు తూర్పు ఉత్తరం, పడమర దక్షిణం దిక్కులలోని మధ్య భాగంలోనూ డ్రైన్ పైపుల ఏర్పాట్లు అనుకూలం. లేకపోతే శ్లాబ్‌పై అక్కడక్కడ నీరు నిలిచి నాచు పట్టి నల్లగా అవుతుంది. నడిచేటప్పుడు జారిపడే ప్రమాదం ఉంటుంది. శ్లాబు కారే ముప్పు ఉంటుంది.
* విశాలమైన స్థలంలో ఇల్లు చిన్నదైనా పెద్దదైనా రహదారి వైపు అంటే బయటకు పైన చెప్పిన దిక్కుల నుంచి వెళ్ళాలి. ఎలాంటి పరిస్థితులలో పడమర నైరుతి, దక్షిణ నైరుతి నుంచి వర్షపు నీటి ప్రవాహం లేదా డ్రైనేజ్ ఏర్పాట్లు వాస్తు శాస్త్రరీత్యా అనుకూలం కాదని గమనించాలి.
* ఇంటికి నాలుగు దిక్కుల్లో ఖాళీ స్థలం ఉంటే అన్నివిధాలా శాస్త్రానుగుణంగా ఏర్పాట్లకు వీలుగా వుంటుంది. తక్కువ విస్తీర్ణంలో కట్టే ఇళ్లకు ఇంటికి నాలుగు వైపులా ఖాళీ స్థలం ఉండకపోవచ్చు. ఇల్లు ఏ దిక్కున ఉన్నా తప్పనిసరిగా ఒకమూల డ్రైనేజీ ఏర్పాట్లకు వాస్తు శాస్త్రం అనుకూలంగా ఉంటుందనేది గుర్తించాలి.
* భవనంపైన ఓవర్‌హెడ్ ట్యాంకు నైరుతిగా దగ్గరగా పడమర, దక్షిణ దిశలో ఏర్పాటు సమ్మతం. అందుకు అనుగుణంగా డ్రైన్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి.
చిన్న ఇంటికి... తక్కువ విస్తీర్ణం కలిగిన ఇంటి శ్లాబ్ పైన పడిన నీరు తూర్పు ఈశాన్యం లేదా ఉత్తరం ఈశాన్యం వైపున కిందకు డ్రైన్ పైపులు ఏర్పాటు చేసుకోవాలి. పడమర వాయువ్యం దక్షిణ ఆగ్నేయం వైపు నుంచి మాత్రమే నీరు పోవడానికి ఏర్పాట్లు ఉండాలి.
* వర్షపు నీటితో పాటు రోజువారీ వాడకం నీరు పైన చెప్పిన ఆయా మూలల నుంచి బయటకు వెళ్ళడానికి మురుగు నీటి వ్యవస్థ ఏర్పాట్లు అనుకూలంగా ఉంటాయి.
ఇంకేలా ముందస్తు ఏర్పాట్లు..
భవిష్యత్తులో నీటి ఎద్దడి రాకుండా ఇంకుడు గుంతలు శాస్త్రీయంగా ఏర్పాటు చేసుకోవాలి. వర్షపు నీరు అందులోకి విడిగా వెళ్లే ఏర్పాట్లు చేసుకోవాలి. ఈశాన్యం వైపు బోరు, బావికి దగ్గరగా ఇంకుడు గుంతల ఏర్పాటు ఫలితాలు ఇస్తుంది.
* వర్షపునీరు వెళ్లే మార్గాలు ఓపెన్‌గా ఉన్నా నష్టం లేదు గాని ఎట్టి పరిస్థితిలోనూ ఇంట్లో కాలకృత్యాలు ఇతరత్రా వాడకం నీరు టాయిలెట్స్ నుంచి పారే మురికి నీరు కనిపించని విధంగా ఏర్పాట్లు ఉంటే అనారోగ్యం పాలు కాకుండా చేస్తాయి. వాస్తుశాస్తాన్రికి వ్యతిరేకంగా ఉన్న నివాసాల్లో ఇబ్బందులు ఇలా వస్తాయని కచ్చితంగా చెప్పలేము గాని శాస్త్రాలు మాత్రం ప్రకృతిలో జరిగే క్రియల ఆధారంగా రూపొందించారని మరచి పోకూడదు. ఏపని అయినా తెలిసి చేసినా తెలియక చేసినా నిర్లక్ష్యం చేసినా తదనుగుణంగా ఫలితాలు తగు విధంగా ఉంటాయనేది కాదనలేం. ఎంతో కష్టార్జితంతో అర్జించిన డబ్బుకు మరికొంత అప్పులు చేసి ఇష్టంతో కట్టుకుంటున్న ఇల్లు పదికాలాలపాటు పదిలంగా ఉండాలంటే ముఖ్యంగా వాస్తు శాస్త్రంతోపాటు ఇంజినీరింగ్ సలహాలు ముఖ్యం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Sangareddy: భార్యాభర్తల గొడవ.. ఏడాదిన్నర చిన్నారి అనుమానాస్పద మృతి
-
India News
Tit for Tat: దిల్లీలోని బ్రిటన్ హైకమిషన్ బయట బారికేడ్లు తొలగింపు..!
-
India News
PM Modi: మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు.. కాసేపట్లో ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష
-
General News
Kendriya Vidyalaya Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ప్రకటన
-
Movies News
Das Ka Dhamki Review: రివ్యూ: దాస్ కా ధమ్కీ
-
Politics News
Chandrababu: ఈ ఏడాది రాష్ట ప్రజల జీవితాల్లో వెలుగులు ఖాయం: చంద్రబాబు