Myhome: తెల్లాపూర్‌లో ‘మైహోం సయుక్‌’ మెగా హౌసింగ్‌ ప్రాజెక్టు రేపే ప్రారంభం

ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ ‘మైహోం’ మరో మెగా రెసిడెన్సియల్‌ ప్రాజెక్టుతో వస్తోంది. ‘మైహోం సయుక్‌’ పేరిట చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టును......

Updated : 11 Jun 2022 04:28 IST

హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ ‘మైహోం’ మరో మెగా రెసిడెన్సియల్‌ ప్రాజెక్టుతో వస్తోంది. ‘మైహోం సయుక్‌’ పేరిట చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టును తెల్లాపూర్‌లో జూన్‌ 9న ఉదయం 11గంటలకు ప్రారంభించనున్నారు. అదే రోజు నుంచి బుకింగ్‌లు కూడా ప్రారంభమవుతాయని మైహోం గ్రూపు ఓ ప్రకటనలో తెలిపింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని తెల్లాపూర్‌లో 25.37 ఎకరాల విస్తీర్ణంలో అన్ని హంగులతో చేపట్టనున్న ప్రాజెక్టులో మొత్తం 12 టవర్లు నిర్మించనున్నారు. దీంట్లో 3,780 ప్లాట్లు ఉండగా.. 1,355 చదరపు అడుగుల విస్తీర్ణంతో 2BHK ఇళ్లు, 1,573 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2.5BHK, 1,956 నుంచి 2,262 చదరపు అడుగుల విస్తీర్ణంతో 3BHK ఇళ్లను అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొంది. అలాగే, లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్‌హౌస్‌ నిర్మిస్తున్నారు. తమ కలల సౌధంలో కస్టమర్లు కోరుకొనే అన్ని సౌకర్యాలు, విలాసాలనూ అందించడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలు, పచ్చదనంతో కూడిన అత్యంత ప్రైమ్‌ లొకేషన్లలో ఇళ్లను అందిస్తున్నట్టు ఆ గ్రూపు పేర్కొంది. తమ గ్రూపు అందించే పరిమిత కాలపు ఆఫర్లను వినియోగించుకోవాలని ‘మైహోం’ గ్రూపు కోరింది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని