కాఫీ కప్పులో చెవుల పిల్లి!

వేడి వేడి కాఫీ చేతికందగానే వెంటనే ఒక గుక్క తాగి ఆస్వాదిస్తాం. అయితే ఆ కాఫీలో రుచితోపాటు చూడచక్కని చిత్రాలు మిమ్మల్ని ఆకర్షిస్తే ఎలా ఉంటుంది? కాఫీ నురగతో రకరకాల ఆకారాలను/ఆకృతులను వేయడాన్ని

Updated : 30 May 2021 05:44 IST

ఫుడ్‌ ఆర్ట్‌

వేడి వేడి కాఫీ చేతికందగానే వెంటనే ఒక గుక్క తాగి ఆస్వాదిస్తాం. అయితే ఆ కాఫీలో రుచితోపాటు చూడచక్కని చిత్రాలు మిమ్మల్ని ఆకర్షిస్తే ఎలా ఉంటుంది? కాఫీ నురగతో రకరకాల ఆకారాలను/ఆకృతులను వేయడాన్ని లాటే ఆర్ట్‌ అని పిలుస్తారు. ఇది ఇప్పుడిప్పుడే మనదేశంలోనూ విస్తరిస్తోంది. సింగపూర్‌కు చెందిన పదిహేడేళ్ల అమ్మాయి... డఫ్నె టాన్‌ ఏకంగా 3డీ లాటేలతో కాఫీ ప్రియుల మనసు దోచుకుంటోంది. పాలనురగ/ క్రీమ్‌తో కాఫీనురగపై పిల్లి, పులి, జిరాఫీ, ఆక్టోపస్‌... ఇలా రకరకాల జంతువులను చూడచక్కగా రూపొందిస్తోంది.  ఇంటర్నెట్‌లో ఈ ఫొటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. కాఫీ కప్పులో తేలియాడే ఆ అందమైన బొమ్మలను చూసేయండి మరి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని