Apples: యాపిల్‌ తింటున్నారా...

రోజూ ఒక యాపిల్‌ తింటే డాక్టర్‌తో పని ఉండదని చిన్నప్పటి నుంచీ వింటున్నాం కదా! ఇంతకీ ఇందులో ఉన్న సుగుణాలేంటో, ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో చూద్దామా.

Published : 07 Jul 2024 00:40 IST

రోజూ ఒక యాపిల్‌ తింటే డాక్టర్‌తో పని ఉండదని చిన్నప్పటి నుంచీ వింటున్నాం కదా! ఇంతకీ ఇందులో ఉన్న సుగుణాలేంటో, ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో చూద్దామా..

కెలోరీలు, పీచు, సి-విటమిన్, కాపర్, పొటాషియంలతో యాపిల్‌ మంచి పోషకాహారం. మలబద్ధక సమస్యను నివారిస్తుంది. ఇది రక్తపోటును క్రమబద్ధం చేస్తుంది. అగ్న్యాశయానికి (పాంక్రియాజ్‌) మంచిది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంట, తాపం, బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మంచి పోషకాలతో దండిగా ఉంటుంది కాబట్టి త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునేవారికి యాపిల్‌ మంచిది. అమెరికాలో 40 వేలమంది మీద జరిపిన పరిశోధనలో యాపిల్స్‌ తినేవారిలో గుండెజబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువని తేలింది. టైప్‌ 2 డయాబెటిస్, రక్తంలో చక్కెరలను నియంత్రిస్తుంది. సైనస్, ఉబ్బసం తదితర శ్వాస ఇబ్బందులను నివారిస్తుంది. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది త్వరగా జీర్ణమవుతుంది కనుక వృద్ధులకు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి కూడా మంచిది.
మనలో చాలామంది యాపిల్‌ చెక్కు తీసి తినడానికి ఇష్టపడతాం. నిజానికి అందులో యాంటీ ఆక్సిడెంట్లు విస్తారంగా ఉన్నాయి కాబట్టి తీయకుండానే తినాలని చెబుతున్నారు ఆహార నిపుణులు. యాపిల్‌ ఎలా తిన్నా రుచిగానే ఉంటుంది. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు