Increase Memory: జ్ఞాపకశక్తి పెరగాలంటే...

ఒకప్పుడు పెద్దవాళ్లు మాత్రమే మతిమరపుతో బాధపడేవారు. ఇప్పుడలా కాదు. అందరికీ జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది. దీనికి ఒత్తిడీ, ఆందోళనే ముఖ్య కారణం.

Published : 07 Jul 2024 00:40 IST

కప్పుడు పెద్దవాళ్లు మాత్రమే మతిమరపుతో బాధపడేవారు. ఇప్పుడలా కాదు. అందరికీ జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది. దీనికి ఒత్తిడీ, ఆందోళనే ముఖ్య కారణం. యోగా, వ్యాయామాలతో చాలావరకూ ఒత్తిడి తగ్గుతుంది. మెదడు ఉత్సాహంగా పనిచేయాలంటే.. జీవనశైలి కూడా సరిగ్గా ఉండాలి. రాత్రి పదింటిలోపు పడుకుని, ఉదయం ఐదింటికల్లా నిద్ర లేవాలి. దాంతో పాటు ఈ ఆహార పదార్థాలనూ క్రమం తప్పకుండా తింటుండాలి.

  • ఆకలి తీరితే చాలనుకుని అన్నంలో పచ్చడో, రసమో కలిపి తినడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రొటీన్లు ఉన్న పప్పుధాన్యాలు తినాలి. మంచి పోషకాహారం అందితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
  • ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్న బాదం, పిస్తా, వాల్‌నట్స్, జీడిపప్పు లాంటివి తినడం వల్ల మెదడులో కణాలు పాడుకావు. దాని పనితీరూ మెరుగవుతుంది.
  • బ్రొకోలీలో మెదడుకు చాలా అవసరమైన కె-విటమిన్‌ విస్తారంగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తి తగ్గకుండా కాపాడుతుంది.
  • నేరేడు, స్ట్రాబెర్రీస్, రేగుపండ్లు, ఉల్లి, వెల్లుల్లి, అవొకాడోల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి మెదడు పనితీరు బాగుండేలా చేస్తాయి.
  • అప్పుడప్పుడూ డార్క్‌ చాక్లెట్‌ తిన్నా మెదడు పనితీరులో సమస్య రాదు.
  • చివరగా మరో విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏదో తప్పదన్నట్టుగా కాకుండా.. ఆస్వాదిస్తూ తినడం వల్ల ఆహారం చక్కగా వంటబడుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని