ఇవి...అతుక్కుంటాయి!

ప్రతి వంటకూ ఒక లెక్క ఉంటుంది. ప్రతి లెక్క వెనుక ఒక చెంచా ఉంటుంది. అవును వంటింట్లో చెంచాలు లేకపోతే పనే అవ్వదు. పావు చెంచా పసుపు, చెంచా నూనె, రెండు చెంచాల కారం...

Published : 12 Jan 2020 01:30 IST

కొత్త పరికరం


ప్రతి వంటకూ ఒక లెక్క ఉంటుంది. ప్రతి లెక్క వెనుక ఒక చెంచా ఉంటుంది. అవును వంటింట్లో చెంచాలు లేకపోతే పనే అవ్వదు. పావు చెంచా పసుపు, చెంచా నూనె, రెండు చెంచాల కారం... ఇలా పదార్థాల కొలత కోసం పక్కాగా వీటిని వాడాల్సిందే. చిక్కంతా ఎక్కడొస్తుందంటే... చెంచాలని పద్ధతిగా ఓ చోట పెట్టుకోవడానికి బదులుగా పని అయిన తర్వాత నిర్లక్ష్యంగా పారేసి వెతుక్కుంటాం.
ఇక్కడ మీరు చూస్తున్న చెంచాలను అలా వెతుక్కోనక్కర్లేదు. అయస్కాంతం ఉన్న వీటిని ఎంచక్కా ఫ్రిజ్‌కు అతికించేయొచ్చు. కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. మాగ్నటిక్‌ మెజరింగ్‌ స్పూన్స్‌ అని ఆన్‌లైన్‌లో వెతికితే దొరుకుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని