బెండకాయ పచ్చడి

బెండకాయలు- పావుకిలో, పచ్చిమిర్చి- గుప్పెడు,  చిన్న ఉల్లిపాయ- ఒకటి, చింతపండు- కొద్దిగా, నూనె- వేయించడానికి సరిపడా, ఉప్పు- తగినంత.

Updated : 05 Apr 2020 01:39 IST

పాఠక వంట

కావాల్సినవి: బెండకాయలు- పావుకిలో, పచ్చిమిర్చి- గుప్పెడు,  చిన్న ఉల్లిపాయ- ఒకటి, చింతపండు- కొద్దిగా, నూనె- వేయించడానికి సరిపడా, ఉప్పు- తగినంత.
తయారీ: బెండకాయ, ఉల్లిపాయ ముక్కలను కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడాయిలో బెండకాయ ముక్కలను వేసి నూనె లేకుండా వేయించాలి. ఇలా చేయడం వల్ల పచ్చడి జిగురు లేకుండా ఉంటుంది. తర్వాత కడాయిలో కొద్దిగా నూనె పోసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, బెండకాయ ముక్కలు వేసి వేయించాలి. చివరిగా కొద్దిగా చింతపండును కూడా వేసి చిన్న మంట మీద బాగా మగ్గనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసి పచ్చడి చేయాలి.

 

- ఎం. విజయకుమారి, డోన్‌, కర్నూలు
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని