టీవిగా తాగేయండి!

తలనొప్పిగా ఉన్నా, కాస్త చిరాగ్గా అనిపించినా వెంటనే ఓ టీ తాగి రిలాక్స్‌ అవుతాం. అయితే ఈ సమస్యలనే కాకుండా జలుబు, దగ్గులను నివారించే టీలూ ఉన్నాయి. అవేమిటే...

Published : 05 Apr 2020 01:15 IST

తలనొప్పిగా ఉన్నా, కాస్త చిరాగ్గా అనిపించినా వెంటనే ఓ టీ తాగి రిలాక్స్‌ అవుతాం. అయితే ఈ సమస్యలనే కాకుండా జలుబు, దగ్గులను నివారించే టీలూ ఉన్నాయి. అవేమిటే...

గ్రీన్‌టీ: దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ టీ రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతుంది. త్వరగా వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది.


మందార: దీంట్లో విటమిన్‌ సి ఉంటుంది. దీంతో చేసిన చల్లని లేదా వేడి టీ ఏది తాగినా ఫలితం ఉంటుంది. ఇది రుచికి కాస్త తియ్యగా, పుల్లగా ఉంటుంది. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గొంతు మంటను తగ్గిస్తాయి.


మునగ: దీన్ని ఆయుర్వేద ఔషధాల్లో ఎన్నో ఏళ్లుగా వాడుతున్నారు. పోషకాల గనిలాంటి మునగలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలు ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి.


అల్లం: ఇది జలుబూ, దగ్గులను తగ్గించడంతో పాటు నొప్పి, వాపులను నివారిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. దీంట్లో విటమిన్‌ సితో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. అధిక జలుబు కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు ఈ టీ ఎంతో సాంత్వన కలిగిస్తుంది.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని