గుడ్డు మసాలా ఇడ్లీ

గుడ్లు- నాలుగు, కారం- టీస్పూన్‌, ధనియాల పొడి- టీస్పూన్‌, గరంమసాలా- టీస్పూన్‌, పసుపు- చిటికెడు...

Published : 12 Apr 2020 00:13 IST

పాఠక వంట

కావాల్సినవి: గుడ్లు- నాలుగు, కారం- టీస్పూన్‌, ధనియాల పొడి- టీస్పూన్‌, గరంమసాలా- టీస్పూన్‌, పసుపు- చిటికెడు, ఉప్పు- తగినంత, నూనె- టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర తురుము- గుప్పెడు.

తయారీ: ఇడ్లీ ప్లేటుకు కొద్దిగా నూనె రాసి ఒక్కో గుంతలో ఒక్కో గుడ్డును పగలగొట్టి వేయాలి. ఇడ్లీ కుక్కర్‌లో గ్లాసు నీళ్లు పోసి ఇడ్లీ ప్లేటును పెట్టి పది నిమిషాలపాటు ఉడికించాలి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె పోసి కారం, ధనియాలపొడి, గరంమసాలా, పసుపు, ఉప్పు వేసి బాగా వేయించాలి. తరువాత ఉడికిన గుడ్డు ఇడ్లీలను ఈ మసాలాలో వేసి విరిగిపోకుండా జాగ్రత్తగా రెండు వైపులా వేయించాలి. చివరగా కొత్తిమీర తురుముతో అలంకరించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని