ముక్కలను పడనీయవు... నూనె రానీయవు!

సాంబారు, రసం అంటే చాలామందికి ఎంతో ఇష్టం. కానీ వాటిలో ఉండే ముక్కలు, కరివేపాకులను చూసి పిల్లలు, ఒక్కోసారి పెద్దవాళ్లు కూడా విసుక్కుంటారు. ఎంత జాగ్రత్తగా తప్పించి వేసుకున్నా అవి పడుతూనే ఉంటాయి.

Updated : 26 Apr 2020 01:56 IST

కొత్త పరికరం

సాంబారు, రసం అంటే చాలామందికి ఎంతో ఇష్టం. కానీ వాటిలో ఉండే ముక్కలు, కరివేపాకులను చూసి పిల్లలు, ఒక్కోసారి పెద్దవాళ్లు కూడా విసుక్కుంటారు. ఎంత జాగ్రత్తగా తప్పించి వేసుకున్నా అవి పడుతూనే ఉంటాయి. ఇక పులుసుల్లో నూనె కాస్త ఎక్కువైతే దాన్ని గరిటెతో తప్పించి వేస్తుంటాం. ఎంత తప్పించినా నూనె పడుతూనే ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులను తొలగిస్తాయి ఈ కొత్తరకం ఫిల్టర్‌ స్పూన్లు. చూడటానికి మామూలు స్టీలు గరిటెల్లానే ఉన్నా వీటికుండే ప్రత్యేక నిర్మాణం వల్ల ముక్కలను వడకడతాయి, నూనెని తేలికగా అడ్డుకుంటాయి. వాడుకోవడానికి, శుభ్రంచేయడానికి అనుకూలంగా ఉండే ఈ గరిటెలు బాగున్నాయి కదూ...


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని