తాజాగా ఉంచే బ్యాగులు!

అప్పుడే కోసిన కూరగాయలతో కూర వండితే.. ఆ రుచి కొన్ని రోజుల వరకు గుర్తిండిపోతుంది. ఒకప్పటిలా పెరట్లోని కూరగాయలను అలా కోసి.. ఇలా వంట చేయలేం. వారానికి సరిపడా

Updated : 03 May 2020 01:04 IST

కొత్త పరికరం!

అప్పుడే కోసిన కూరగాయలతో కూర వండితే.. ఆ రుచి కొన్ని రోజుల వరకు గుర్తిండిపోతుంది. ఒకప్పటిలా పెరట్లోని కూరగాయలను అలా కోసి.. ఇలా వంట చేయలేం. వారానికి సరిపడా కూరగాయలు కొనుక్కుని ఫ్రిజ్‌లో పెట్టేసుకుంటున్నాం. కొన్ని రోజుల తర్వాత వండుకునే సమయానికి అవి వేలాడిపోతుంటాయి. అలాకాకుండా కొంతకాలంపాటు కాయగూరలు తాజాగా ఉండాలంటే ఈ ‘యాంబ్రోషియా బ్యాగ్స్‌’ మన దగ్గర ఉండాల్సిందే. వీటిని అవిసె నారతో తయారుచేయడం వల్ల కూరగాయల్లోని తేమను కాపాడతాయి. కడిగిన తర్వాత ఆకుకూరలు, పండ్లు, కూరగాయలను ఈ బ్యాగుల్లో వేసి ఫ్రిజ్‌లో పెడితే కొన్ని రోజులపాటు తాజాగా ఉంటాయి. ప్లాస్టిక్‌ బ్యాగ్‌ల స్థానంలో వీటిని ఉపయోగించడం వల్ల కూరగాయలు పాడవకుండా ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని