చిటికెలో ‘సత్తు’వ!

ఎండాకాలంలో సూర్యుడు నడి నెత్తిన స్ట్రా వేసుకుని మరీ మన శక్తిని పీల్చేస్తుంటాడు. మరోపక్క నీరసం ముంచుకొస్తుంటుంది. దాన్ని తగ్గించుకోడానికి ఏమైనా తిందామని ప్రయత్నించినా ఏమీ తినబుద్ధికాదు. చల్లటి నీళ్లు ఎన్నయినా

Updated : 03 May 2020 01:04 IST

పోషకాలం!

ఎండాకాలంలో సూర్యుడు నడి నెత్తిన స్ట్రా వేసుకుని మరీ మన శక్తిని పీల్చేస్తుంటాడు. మరోపక్క నీరసం ముంచుకొస్తుంటుంది. దాన్ని తగ్గించుకోడానికి ఏమైనా తిందామని ప్రయత్నించినా ఏమీ తినబుద్ధికాదు. చల్లటి నీళ్లు ఎన్నయినా తాగాలనిపిస్తుంది. ఆ తాగేవాటిలోనే కావాల్సినన్ని పోషకాలూ ఉంటే రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేసుకోవచ్చు. సరిగ్గా అలాంటిదే ఈ సత్తు జావ. ప్రొటీన్లు, పీచు అధికంగా ఉండే దీన్ని తీసుకోవడం ద్వారా ఎండ వేడి నుంచి కాపాడుకోవచ్చు. అత్యధిక పోషక విలువలున్న దీన్ని ఎలా తయారుచేయాలంటే...
కావాల్సినవి: వేపుడు సెనగల పొడి- రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు- చిటికెడు, వేయించిన జీలకర్ర పొడి- అర టీస్పూన్‌, నిమ్మచెక్క- ఒకటి, పుదీనా ఆకులు- నాలుగైదు, చల్లటి నీళ్లు- ముప్పావుగ్లాసు.
తయారీ: వేపుడు సెనగలను ముందుగా మిక్సీలో వేసి పొడి చేయాలి. పెద్దగ్లాసులో సెనగల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి వేసి నిమ్మరసం పిండాలి. ఈ మిశ్రమంలో చల్లటి నీళ్లు పోసి చివరగా పుదీనా ఆకులను నలిపి వేయాలి.
తీపి సత్తుజావ
* సెనగల పొడిలో పంచదార వేసుకుని తీపి సత్తుజావ కూడా తయారుచేసుకోవచ్చు. చివర్లో నిమ్మరసం పిండుకుని కాసిన్ని పుదీనా ఆకులను నలిపి వేసుకోవాలి.
* ఈ జావలో కొద్దిగా బార్లీ పొడిని కూడా కలిపితే మరిన్ని పోషకాలు అందుతాయి.
* జావ తాగడం ఇష్టం లేకపోతే పుల్కాలు చేసుకునేటప్పుడు కాస్త సెనగల పొడిని కలపొచ్చు. ఇలా చేయడం వల్ల పుల్కాలకు అదనపు రుచి, పోషకాలు అందుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని