పుచ్చకాయ పాయసం

కావాల్సినవి: గింజలు తీసిన పుచ్చకాయ గుజ్జు - రెండు కప్పులు, వేయించిన సేమ్యా- కప్పు, వేయించిన సగ్గుబియ్యం- పావుకప్పు, కాచిన పాలు- కప్పు, బెల్లం తురుము- కప్పు, అటుకులు-

Updated : 03 May 2020 01:05 IST

పాఠక వంట

కావాల్సినవి: గింజలు తీసిన పుచ్చకాయ గుజ్జు - రెండు కప్పులు, వేయించిన సేమ్యా- కప్పు, వేయించిన సగ్గుబియ్యం- పావుకప్పు, కాచిన పాలు- కప్పు, బెల్లం తురుము- కప్పు, అటుకులు- రెండు టేబుల్‌స్పూన్లు, తేనె- రెండు టీస్పూన్లు, యాలకుల పొడి- పావు టీస్పూన్‌, వేయించిన జీడిపప్పు, బాదంపప్పు ముక్కలు- పావుకప్పు, కొబ్బరి తురుము- పావు కప్పు, నెయ్యి- టేబుల్‌స్పూన్‌, నీళ్లు - రెండు కప్పులు.
తయారీ: మందపాటి గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి తర్వాత నీళ్లు పోసి మరిగించాలి. వేయించిన సేమ్యా, సగ్గుబియ్యం, కొబ్బరి తురుము వేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. తర్వాత పుచ్చకాయ గుజ్జు, బెల్లం తురుము, యాలకుల పొడి, అటుకులు వేసి మరికాసేపు ఉడికించాలి. ఇది బాగా ఉడికి కొంచెం చిక్కబడ్డాక దించి తేనె వేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారాక కాచిన పాలు పోసి బాగా కలపాలి. చివరగా వేయించి జీడిపప్పు, బాదంపప్పు ముక్కలతో పాయసాన్ని అలంకరించుకోవాలి. ఇది చక్కటి రంగుతో చూడటానికి ఆకర్షణీయంగా ఉండటంతోపాటు రుచిగానూ ఉంటుంది.

- పింగళి భాగ్యలక్ష్మి, గుంటూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని