ఈ ఆకు పడాల్సిందే!

బిర్యానీకి ఆ ఘుమఘుమలు ఎక్కడివి... పాయసానికి ఆ రుచి ఎలా వచ్చింది... అని అన్వేషించే వాళ్లకు దొరికే సమాధానం బిర్యానీ ఆకు. వంటకం ఏదైనా దాంట్లో ఈ ఆకును వేసి చూడండి...

Published : 17 May 2020 01:23 IST

పోషకాలం

బిర్యానీకి ఆ ఘుమఘుమలు ఎక్కడివి... పాయసానికి ఆ రుచి ఎలా వచ్చింది... అని అన్వేషించే వాళ్లకు దొరికే సమాధానం బిర్యానీ ఆకు. వంటకం ఏదైనా దాంట్లో ఈ ఆకును వేసి  చూడండి... దాని రుచి ఎలా మారిపోతుందో మీకే తెలుస్తుంది. ఇలా వంటకానికి అదనపు రుచినీ, హంగులను అద్దే ఈ ఆకు వల్ల ఎన్నో ఉపయోగాలూ ఉన్నాయి.  అవేమిటంటే...
* బిర్యానీ ఆకు ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
* గుండెకు మంచిది. చెడు కొలెస్ట్రాల్‌ను నివారించడానికి తోడ్పడుతుంది.
* ఒత్తిడిని నియంత్రిస్తుంది. కుంగుబాటును దరిచేరనీయదు.
* కొందరికి ఒళ్లంతా మండుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఆ బాధనూ ఇది నియంత్రిస్తుంది. అంతేకాదు త్వరగా కీళ్ల నొప్పుల బారినపడకుండా కాపాడుతుంది.
* గాయాలను మాన్పుతుంది. దీంట్లో ఉండే యాంటీమైక్రోబియల్‌ లక్షణాల వల్ల గాయాలు త్వరగా నయమవుతాయి.
* బిర్యానీ ఆకును తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు తగ్గినట్లుగా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని