Published : 17 May 2020 01:26 IST

తీరొక్క రకంగా...దాహం తీరుస్తాయి!

కొత్తపరికరం!

మంచినీళ్లు తాగాలని అనిపించినా.. ఆఫీసు పనిలో పడి ఒక్కోసారి ఆ విషయాన్నే మర్చిపోతుంటాం. ఎప్పుడో గొంతు బాగా తడారిపోయినప్పుడుగానీ ఆ విషయం గుర్తుకురాదు. అలాకాకుండా నీళ్లు ఎప్పుడెప్పుడు తాగాలో నీళ్ల సీసానే మనకు చెబితే ఎంత బాగుంటుందో కదా... ఇదిగో ఈ బాటిల్‌ అలాంటిదే. మీరు చేయాల్సిందల్లా దీన్ని మీ టేబుల్‌ మీద పెట్టుకోవడమే. ఎప్పుడెప్పుడు మీరు నీళ్లు తాగాలో దీని మీద స్పష్టంగా రాసి ఉంటుంది. దాని ప్రకారం మీరు మంచినీళ్లు తాగేస్తూ ఉంటే.. ఆరోగ్యంతో వచ్చిన ఆనందంతో రోజంతా హాయిగా పనిచేసుకుంటారు. ఇవేకాకుండా మార్కెట్లో ఇప్పుడు ఎన్నో రకాల బాటిల్స్‌ లభిస్తున్నాయి. మీరు జిమ్‌కో, బజారుకో వెళుతున్నప్పుడు వాటర్‌బాటిల్‌, పర్సు వేర్వేరుగా తీసుకెళ్లనవసరం లేదు. ఎందుకంటే బాటిల్‌లోనే ఇంటి తాళం, డబ్బు లేదా కార్డు పెట్టుకోవడానికి వీలుగా ఉండే ‘వాలెట్‌ బాటిల్స్‌’ అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రయాణాల్లో సీసా  కోసం ప్రత్యేకంగా ఎక్కువ స్థలం కేటాయించనవసరం లేకుండా మడత పెట్టుకునే వీలున్న మంచినీళ్ల సీసాలూ మార్కెట్లో లభిస్తున్నాయి. మీరు ఎలాంటి నీళ్ల సీసాను ఎంచుకున్నా కావాల్సినప్పుడు కడుపునిండా మంచినీళ్లు తాగడం మాత్రం మర్చిపోకండేం...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts